Sharia Law : కనుబొమ్మలు సరి చేయించుకోరాదు... ఫత్వా జారీ

Sharia Law : కనుబొమ్మలు సరి చేయించుకోరాదు...  ఫత్వా జారీ
మెసేజ్ ద్వారా తలాఖ్ కు ఆమోదం; ఇరువురూ సుముఖంగా ఉంటే షరియా చట్టం ప్రకారం విడాకులు చెల్లుబాటు

మహిళలు కనుబొమ్మలను షేపింగ్ చేయిచుకోకూడదని, జుట్టును క్రమబద్దంగా కత్తిరించుకోకూడదని ఫత్వా జారీచేశారు ముస్లిం మత పెద్దలు. ఇందుకుగాను ఉత్తర ప్రదేశ్ బరేలీ కి చెందిన అలా హజ్రత్ దర్గా ఫత్వా జారీచేసింది. ముస్లిం యవకులు తన గుర్తింపును దాచుకోకుండా వేరే మతానికి చెందిన యువతులను ప్రేమించకూడదని తెలిపింది. ఇది ఇస్లాం ప్రకారం హరాం అని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన మగవాళ్లు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ లు చేయించుకోవద్దని, మహిళలు జుట్టును కత్తిరించుకోకూడదని ఫత్వా జారీచేశారు.

లవ్ జీహాద్ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలపై బారాబంకికి చెందిన డాక్టర్ మహ్మద్ నదీమ్ అడిగిన ప్రశ్నకు సమాదానంగా సదరు దర్గా ఈ ఉత్తర్వులను(ఫత్వా) జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ అయినట్లు మీడియాకు తెలిపారు. "ముస్లిం యువకులు ఇస్లాం చట్టాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ముస్లిమేతర యువతులను ప్రేమించి పెళ్లిచేసుకుంటున్నారు. నుదుట తిలకం ధరించి, చేతికి కడియం వేసుకుని వేరే మతానికి చెందిన యువతులతో ప్రేమ వ్యవహరం నడిపిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఇస్లాంకు విరుద్దం" అని మీడియా సమావేశంలో రజ్వీ అన్నారు.

పురుషులు తమ బట్టతలను కవర్ చేసుకోవడానికి ట్రాన్స్ ప్లాంట్ చేసుకోకూడదని అన్నారు రజ్వీ. భర్త తన భార్యకు ఎస్ఎమ్ఎస్ ద్వారా మూడు సార్లు తలాక్ చెబితే అందుకు తన భార్య కూడా తలాక్ ను అంగీకరిస్తే అది షరియా చట్టం ప్రకారం విడాకులు చెల్లుబాటు అవుతాయని ముస్లిం మతగురువులు చెప్పారు.

ఉత్తర్ ప్రదేశ్ సీఎం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నవంబర్ 2020లో చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం, బలవంతం, మెసం, మితిమీరిన ప్రభావం ద్వారా మహిళలను మతమార్పిడీ చేయడాన్ని నిషేదించారు. యువతులను మతం మార్చడమే లక్ష్యంగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కూడా చెల్లదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story