Siddaramaiah : అసెంబ్లీలో సీరియస్‌‌గా చర్చ.. ఊడిపోబోయిన సిద్దరామయ్య పంచె..!

Siddaramaiah : అసెంబ్లీలో సీరియస్‌‌గా చర్చ.. ఊడిపోబోయిన సిద్దరామయ్య పంచె..!
Siddaramaiah : ఆ రాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య నిలబడి సీరియస్‌‌గా మాట్లాడుతుండగా ఆయన పంచె ఊడిపోబోయింది.

Siddaramaiah : కర్ణాటాక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య నిలబడి సీరియస్‌‌గా మాట్లాడుతుండగా ఆయన పంచె ఊడిపోబోయింది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆయన వద్దకు వెళ్లి చెవిలో వెళ్లి చెప్పగా.. అయ్యో అలా ఉందా? పంచె సరి చేసుకున్నాక ప్రసంగాన్ని కొనసాగిస్తానని అన్నారు. దీనితో అసెంబ్లీలో నవ్వులు పూసాయి. దీనికి ముందు మైసూర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపైన సిద్దరామయ్య సీరియస్‌‌గా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.

పంచెను సరిచేసుకున్న తర్వాత సిద్దరామయ్య మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను నాలుగైదు కేజీల పెరిగానని, ఈ క్రమంలో తన పొట్ట కూడా పెరుగడంతో నిలబడి మాట్లాడుతున్నప్పుడు పంచె ఊడిపోబోయిందని చెప్పారు. సిద్దరామయ్య అన్న మాటలకి అధికారపక్ష నేతలు ఏమైనా సహాయం కావాలా అంటూ పరిహాసం అడిగారు. అయితే మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీ సహాయం మేం కోరబోమని సిద్దరామయ్య కోరుతూ అన్నారు.

ఇదే విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సిద్దరామయ్యతో పాటుగా పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు తమ నేత డీకే శివకుమార్‌ ఈ విషయాన్ని ఆయన చెవిలో చెబితే.. సిద్దరామయ్య మాత్రం సభ మొత్తానికి వెల్లడించారని, దీనిపైన బీజేపీ నేతలు తమ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఎదురుచూస్తారని నవ్వుతూ అన్నారు. అయితే దీనికి సిద్దరామయ్య స్పందిస్తూ .. వారు దీనికి ప్రయత్నించినా మన ఇమేజ్‌ను దెబ్బతీయలేరు అంటూ వ్యాఖ్యానించారు. దీనితో అసెంబ్లీలోని వారంతా కాస్త నవ్వుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story