SP manifesto : అధికారంలోకి వస్తే నెలకి లీటర్ పెట్రోల్ ఫ్రీ...!

SP manifesto : అధికారంలోకి వస్తే నెలకి లీటర్ పెట్రోల్ ఫ్రీ...!
SP manifesto : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సమాజ్ వాదీ పార్టీ మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించింది.

SP manifesto : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సమాజ్ వాదీ పార్టీ మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టో లోని అంశాలను ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మీడియాకి వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే సాగునీటి కోసం రైతులందరికీ ఉచిత కరెంటు, వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. రైతుల పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

చెరుకు రైతులకు 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా.. 2025 నాటికి రైతులందరినీ రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచామని అన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, వారి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాలు నిర్మిస్తామని తెలిపారు. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 2 బస్తాల డీఏపీ, 5 బస్తాల యూరియా ఎరువులు ఉచితంగా అందజేస్తామన్నారు.

పేదరికం కంటే దిగువన ఉన్న (BPL) వర్గంలోని వృద్ధులు, నిరుపేద మహిళలు, కుటుంబాలాకి ప్రతి సంవత్సరం రూ. 18,000 అందజేస్తామని చెప్పారు. దీనివల్ల దాదాపు కోటి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని, బాలికల విద్యను కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. 'కన్యా విద్యాధన్' పథకం ద్వారా ఒక్కో బాలికకు రూ.36 వేలు ఇస్తామని చెప్పారు.

అటు మహిళలకు ఏటా రెండు ఉచిత సిలిండర్లు ఇస్తామని తెలిపారు. టూ వీలర్ యజమానులకి ప్రతినెలా లీటర్ పెట్రోల్‌ ఉచితంగా ఇస్తామని, 300 యూనిట్ల గృహ ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. పరిశ్రమలకు సింగిల్‌ రూఫ్‌ క్లియరెన్స్‌ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా యూపీ మొత్తం 24 గంటల కరెంటు ఇవ్వనున్నామని వెల్లడించారు. యువతపై దృష్టి సారించి, అన్ని గ్రామాల్లో, నగరాల్లో ఉచిత వైఫై జోన్‌లను ఏర్పాటు చేస్తామని, 2027 నాటికి 20 మిలియన్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అఖిలేష్.

Tags

Read MoreRead Less
Next Story