Spice Jet: గొడవేసుకున్నారు...దించేశారు...!

Spice Jet: గొడవేసుకున్నారు...దించేశారు...!
మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను ఇద్దరు వ్యక్తులను విమానం నుంచి దించేసిన వైనం.... ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన

మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను ఇద్దరు వ్యక్తులను విమానం నుంచి దించేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. 'స్పైస్ జెట్' - 8133 విమానం ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంతలోనే అబ్సర్ ఆలం అనే వ్యక్తి 'స్పైస్ జెట్' విమానంలోని మహిళా సిబ్బందితో గొడవ పడ్డాడు. ఆలంతో పాటు మరో వ్యక్తి కూడా గొడవలో భాగమయ్యాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సదరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.


స్పైస్ జెట్ సెక్యూరిటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అబ్సర్ ఆలంతో పాటు మరో వ్యక్తిపై 354A కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని జామియా నగర్ కు చెందిన అబ్సర్ ఆలం అనే ప్రయాణికుడు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్నాడు. టేకాఫ్ సమయంలో ఒక మహిళా సిబ్బందితో ఆలం అనుచితంగా ప్రవర్తించాడు. అతనితో మరొకతను గొడవలో తోడయ్యాడు. సిబ్బంది ఫిర్యాదుతో ఇద్దరు ప్రయాణికులపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు స్టేషన్ కు తరలించారు.


స్పైస్ జెట్ మహిళా సిబ్బందిపై ఇద్దరు ప్రయాణికులు అరిచిన వీడియో వైరల్ అయింది. స్పైస్ జెట్ ఫ్లైట్ నంబర్ 8133లో ఓ ప్రయాణికుడు వేధించాడని పేర్కొంటు పీసీఆర్ కు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story