Top

అల్లు అర్జున్‌పై అభిమానం.. రోజుకు 40 కిలోమీటర్లు నడిచి..

తనను కలుసుకోవడానికి వస్తున్నాడని ముందే తెలుసుకున్న బన్నీ వెంటనే తన టీమ్‌ని పంపించి హైదరాబాద్ తీసుకురమ్మని చెప్పారు.

అల్లు అర్జున్‌పై అభిమానం.. రోజుకు 40 కిలోమీటర్లు నడిచి..
X

సినిమా తారలను అభిమానించే ఫ్యాన్స్ వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. 15 సంవత్సరాలుగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని అభిమానించే ఓ వ్యక్తి తన స్వగ్రామం నుంచి 6 రోజులు 200 కి.మీ ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాడు. అతడు తనను కలుసుకోవడానికి వస్తున్నాడని ముందే తెలుసుకున్న బన్నీ వెంటనే తన టీమ్‌ని పంపించి హైదరాబాద్ తీసుకురమ్మని చెప్పారు. కానీ అతడి ఆచూకీ తెలుసుకోలేపోయారు. ఎట్టకేలకు 6 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్న నాగేశ్వరరావు అల్లు అర్జున్‌ని కలుసుకున్నాడు.

రోజుకు 40 కిలోమీటర్లు నడిచి వచ్చానని నాగేశ్వర్రావు చెప్పేసరికి బన్నీకి బాధనిపించింది. అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఉండకూడదని అన్నారు. ముందు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. కుటుంబం కోసం కష్టపడండి. మీ కుటుంబాన్ని వదిలేసి ఇంత దూరం ప్రయాణించి వచ్చావు. నీ ఆరోగ్యం ఏమైనా అయితే నీ ఫ్యామిలీ ఎంత బాధ పడుతుంది.. ఆ విషయం తెలిస్తే నేను మాత్రం ఎలా సంతోషంగా ఉండగలను. దయచేసి ఎవరూ కూడా ఇలా చేయవద్దు అని అభిమానులను ఉద్దేశించి అర్జున్ హితవు పలికారు.

నాగేశ్వర్రావు కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకుని కాసేపు ముచ్చటించారు. అభిమానికి గుర్తుగా ఓ మొక్కని బహుమానంగా ఇచ్చారు దాంతో పాటు AA మాస్కులు ఇచ్చారు. వీలున్నప్పుడల్లా తానే అభిమానులను కలుసుకునే ప్రయత్నం చేస్తానని బన్నీ అన్నారు.

Next Story

RELATED STORIES