Supreme Court : సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

Supreme Court : సుప్రీం కోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు
సోమవారం సుప్రీంకోర్టు నూతన భవనసముదాయంలోని ఆడిటోరియంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్ ఐదుగురు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు


సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సుప్రీంకోర్టు నూతన భవనసముదాయంలోని ఆడిటోరియంలో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్ ఐదుగురు న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మనోజ్ మిశ్రాల పేర్లను రెండు రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది.

సుప్రీం కోర్టుతో పాటు, 25 హైకోర్టులకు న్యాయమూర్తుల నిమాయకంపై కేంద్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పేర్లను క్లియర్ చేసింది కేంద్రం. ఐదుగురు న్యాయమూర్తుల చేరికతో, అత్యున్నత న్యాయస్థానం యొక్క సంఖ్య 32కు చేరింది. సుప్రీం న్యాయమేర్తుల సంఖ్య మొత్తం 34. ఇక హైకోర్టు న్యాయమూర్తులను ఖరారు చేయాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story