వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం నోటీసులు..

వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం నోటీసులు..
నాలుగు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని సదరు యాప్‌లను ఆదేశించింది.

బడా బాడా కంపెనీలైతేనేం.. బిలియన్, ట్రిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తేనేం.. ప్రజల వ్యక్తిగత ప్రైవసీకి ఆటంకం కలిగిస్తారా అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. నాలుగు వారాల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని సదరు యాప్‌లను ఆదేశించింది. యాప్‌లకు సంబంధించిన కొత్త ప్రైవసీ పాలసీ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడడం కోసం జోక్యం చేసుకోక తప్పదని సుప్రీం భావించింది. దీనికి సంబంధించి కేంద్రంతో పాటు ఈ రెండు యాప్‌లకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ యాప్‌ల తరపున కపిల్ సిబాల్, అరవింద్ దాతర్ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story