Tamilnadu : పన్నీర్‌ సెల్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Tamilnadu : పన్నీర్‌ సెల్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే చెందినట్లైంది. సుప్రీం తీర్పుతో పళని వర్గం శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి

అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంకు సుప్రీంకోర్టు లో గట్టి ఎదురుదెబ్బ తగలిగింది. పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎడప్పాడి పళనిస్వామి ఎన్నిక సరైందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ కొనసాగేలా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికయ్యారు. దీనిపై పన్నీర్‌ సెల్వం ముందుగా ముద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్‌ 23కి ముందు పరిస్థితే ఉంటుందని తీర్పుఇచ్చింది. అయితే, దీనిపై మద్రాసు హైకోర్టులో పళనిస్వామి అప్పీలు చేశారు. తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. అయితే...సర్వసభ్య సమావేశం చెల్లుతుందని,. జనరల్‌ సెక్రటరీగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు పన్నీర్‌ సెల్వం. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఓపీఎస్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు మాజీ సీఎం పళనిస్వామికే చెందినట్లైంది. సుప్రీం తీర్పుతో పళని వర్గం శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి.

Tags

Read MoreRead Less
Next Story