వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్..

వ్యాక్సిన్ వేసుకోకపోతే జీతం కట్..
కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. వైరస్ బారిన పడకుండా ఉండండి అని ఎంత మొత్తుకున్నా వినట్లేదని ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతాలు ఇవ్వనంటోంది

కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. వైరస్ బారిన పడకుండా ఉండండి అని ఎంత మొత్తుకున్నా వినట్లేదని ఉద్యోగులకు డిసెంబర్ నెల జీతాలు ఇవ్వనంటోంది మధురై విద్యుత్ బోర్డు. చీఫ్ ఇంజనీర్ జారీ చేసిన సర్క్యులర్ చూసి ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఇప్పటికే 75 శాతానికి పైగా విద్యుత్ శాఖ ఉద్యోగులు రెండు డోసుల టీకాలు వేసుకున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతున్న తరుణంలో ఇంజనీర్ ఉద్యోగుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారం కావడంతో బోర్డు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందారు.

ఇంజనీర్ చర్యను విమర్శిస్తున్నారు. దీంతో దిగి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి డిసెంబర్ నెల జీతాలు ఉద్యోగులు అందజేస్తాం అని హామీ ఇచ్చారు. జీతం కట్ చేస్తామంటే ఉద్యోగులు అందరూ టీకాలు వేయించుకుంటారనే ఉద్దేశంతో ఆ విధమైన ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story