నువు దేవుడివి సామీ.. సోనూ సూద్‌కి గుడికడుతున్న గిరిజనులు..

నువు దేవుడివి సామీ.. సోనూ సూద్‌కి గుడికడుతున్న గిరిజనులు..
కష్టమొస్తే కళ్లన్నీ సోనూ సూద్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఎందరి జీవితాల్లోనో వెలుగులు పంచుతున్న సోనూసూద్‌కు..

సినిమాల్లో హీరోలు చాలా మంచోళ్లు.. విలన్లు మాత్రం చాలా చెడ్డోళ్లు.. అతడు మాత్రం సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా నిజ జీవితంలో హీరో అయ్యాడు.. అడక్కుండానే సాయం అందించి అందరి చూపు తనవైపే తిప్పుకున్నాడు.. కష్టమొస్తే కళ్లన్నీ సోనూ సూద్ వైపే ఆశగా చూస్తున్నాయి. ఎందరి జీవితాల్లోనో వెలుగులు పంచుతున్న సోనూసూద్‌కు గిరిజనులు గుడి కట్టి తమ హృదయంలో కొలువైన దేవుడికి హారతులు పడుతున్నారు.

తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని దుబ్బ తండా వాసులు సోనూ సూద్‌కు గుడి కట్టారు. సోనూ లక్షలాది మందికి చేస్తున్న సాయం చూసి ఆయనలో దేవుడిని చూస్తున్నారు. అందుకే ఆయనకు గుడి కట్టి తమ వినమ్రతను చాటుకున్నారు. ఓట్ల కోసం నోట్లు గుమ్మరించే నాయకులకు ప్రజల కష్టాలు పట్టవు.. అందుకే దేశంలో ఏ ప్రాంతంలోని వారైనా కష్టం వస్తే స్థానిక నాయకులకో, అధికారులకో, ప్రభుత్వానికో మొర పెట్టుకోవడం మానేశారు.. సోనూకి ట్వీట్ చేస్తున్నారు.. ప్రతి ట్వీట్‌కి స్పందిస్తున్న సోనూ నిజంగా నిస్సహాయుల జీవితాల్లో దేవుడే మరి. కలియుగ దానకర్ణుడికి గుడి కట్టడాన్ని తాము అదృష్టంగా భావిస్తున్నట్లు తండా వాసులు ఆనందంగా చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story