65 వేల ఖాళీలు.. ప్రభుత్వానికి చేరిన వివరాలు..

65 వేల ఖాళీలు.. ప్రభుత్వానికి చేరిన వివరాలు..
ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.

తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి. వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.

ఈ నివేదిక ప్రకారం పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవి కాక ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో 3 వేల వరకు ఉన్నాయి. శాఖల వారీగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీకరిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story