corona Third wave : ఆగస్టులోనే భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు.. సెప్టెంబర్‌లో పీక్ స్టేజ్‌కి...!

corona Third wave : ఆగస్టులోనే భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు.. సెప్టెంబర్‌లో పీక్ స్టేజ్‌కి...!
corona Third wave : ఇప్పుడిప్పుడే కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి బయటపడుతున్న భారత్‌కు ఎస్బీఐ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడించింది.

ఇప్పుడిప్పుడే కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి బయటపడుతున్న భారత్‌కు ఎస్బీఐ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆగస్టులో భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇది సెప్టెంబర్‌ నాటికి పీక్ స్టేజ్‌కి వెళ్తుందని తాజా అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఎస్‌బీఐ నిపుణుల బృందం రూపొందించిన ఈ నివేదికను.. కొవిడ్‌-19 ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌ పేరుతో విడుదల చేశారు.

సెకండ్‌ వేవ్‌లో ఈ ఏడాది మే 7న రోజువారీ కరోనా కేసులు పతాకస్థాయికి చేరగా, అవి క్రమంగా తగ్గుతూ ఈనెల రెండోవారం నాటికి దాదాపు 10వేల కనిష్ట స్థాయికి చేరొచ్చని పేర్కొంది. అయితే ఆగస్టు రెండోవారం తర్వాత మూడో వేవ్‌ మొదలై కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుందని, సెప్టెంబరు నాటికి గరిష్ఠ స్థాయికి చేరుతాయని ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక అంచనా వేసింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని అభిప్రాయపడింది.

సగటును కరోనా థర్డ్ వేవ్ పీక్ కేసులు.. సెకండ్ వేవ్ సమయంలో నమోదైన గరిష్ఠ సంఖ్యలో కేసుల కంటే 1.7 రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. పాలకులు, ప్రజలు ఈ నివేదికపై దృష్టి పెట్టాలని ఎస్బీఐ రిసెర్చ్ సూచించింది. గత నివేదికల ఆధారంగా చూస్తే.. ఆగస్టు ద్వితీయార్ధంలో కేసుల పెరుగుదల కనిపిస్తుందని.. తరువాత నెలలో కొవిడ్ ఉధృతి తీవ్రస్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. అలాగే భారత్‌లో సగటున 40 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు పంపణీ చేస్తున్నారని చెప్పింది. దేశ జనాభాలో 4.6 శాతం మందికి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మరో 20.8 శాతం జనాభాకు ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపింది.

జనాభా శాతంలో పోలిస్తే.. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది తక్కువగా ఉందని ఎస్బీఐ రిసెర్చ్ అభిప్రాయపడింది. మొత్తం డోసుల సంఖ్య ప్రకారం ఇతర దేశాల కంటే భారత్‌ ఎక్కువ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించింది.

Tags

Read MoreRead Less
Next Story