మోగాలి భాజాలు.. మూడు నెలలే మంచి ముహూర్తాలు

మోగాలి భాజాలు.. మూడు నెలలే మంచి ముహూర్తాలు
పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని వివరిస్తున్నారు పండితులు.

కరోనా వచ్చి కళ్యాణ వేడుకలను కట్టడి చేసింది. హంగూ ఆర్భాటంతో తమ తాహతును చాటుకుందామనుకుంటే కరోనాకు తలవొగ్గి నలుగురిని మాత్రమే పిలిచి నాలుగు అక్షింతలు వేయించుకుని మమ అని పించుకున్నారు పెళ్లి చేసుకున్న కొన్ని కొత్త జంటలు. ఇప్పడిప్పుడే మహమ్మారి ఫియర్ నుంచి బయట పడి సాధారణ జీవితం గడపడానికి సంసిద్ధమవుతున్న వేళ మూడు నెలల పాటు ముహుర్తాలు కూడా బావున్నాయి.. పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని వివరిస్తున్నారు పండితులు.

ప్రభుత్వం కూడా పరిమిత ఆంక్షలకు లోబడి పెళ్లిళ్లు చేసుకోమంటూ కళ్యాణ మండపాలకు, ఆలయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 29 నుంచి మూడు నెలల పాటు సుమూహుర్తాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు, గృహప్రవేశాల జోరూ పెరగనుంది. భాద్రపద, అధిక ఆశ్వయుజ మాసాల కారణంగా గడిచిన రెండు నెలల నుంచి ముహూర్తాలు లేవు.. కోవిడ్ పరిస్థితులు కుదుట పడడంతో దేవాలయాలు, కళ్యాణ మండపాల్లో ఆంక్షలతో కూడిని అనుమతులు లభంచనున్నాయి. దాదాపు ఆరు నెలలుగా మూత పడిన కళ్యాణ మండపాలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. కళ్యాణ ఘడియలు దగ్గరపడడంతో కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవనున్నాయి. దేవలయాల్లో పెళ్లిళ్లకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తున్నారు అధికారులు.

హాజరయ్యే అతిధుల సంఖ్యకు ఆంక్షలు పెడుతున్నా ఆరు నెలలుగా ఓ పార్టీ లేదు, ఫంక్షన్ లేదు.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటామంటూ వందల సంఖ్యలో అతిధులను ఆహ్వానించడానికి సిద్ధమైపోతున్నారు. తమ ఇంట జరిగే పెళ్లి సందడికి ఆహ్వాన పత్రికలను అచ్చువేయిస్తున్నారు. 2021 జనవరి రెండో వారం నుంచి నాలుగు నెలల పాటు ముహూర్తాలు లేవని తెలిసి తొందరపడుతున్నారు అమ్మాయి/అబ్బాయికి పెళ్లి చేయడానికి బంధు మిత్రులతో పాటు కుటుంబసభ్యులు.

పండితులు సూచించిన శుభ ఘడియలు.. నిజ ఆశ్వయుజ మాసం ఈ నెల 29,30,31 కాగా నవంబరు నెలలో 4,11 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. కార్తీకమాసంలో నవంబరు 17,19,20,21,22,25,26 డిసెంబరు 1,6,8,9 తేదీల్లో, మార్గశిర మాసంలో డిసెంబరు 17,18,20,24,27 తేదీల్లోనూ, 2021 సంవత్సరంలో జనవరి 2,7 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. 2021 జనవరి 16 నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు మౌఢ్యమి కారణంగా మంచి ముహూర్తాలు లేవు.

Tags

Read MoreRead Less
Next Story