TS: వేసవికి ముందే భానుడి భగభగ

TS: వేసవికి ముందే భానుడి భగభగ
ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు అప్పుడే తెలుగు రాష్ట్రాల ప్రజలపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు

వేసవికి ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయ్. ఎండాకాలం ఇంకా మొదలే కాలేదు అప్పుడే తెలుగు రాష్ట్రాల ప్రజలపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. నిన్న ఖమ్మంలోని ప్రకాశ్‌ నగర్‌లో 39 డిగ్రీలు, మహాబూబ్‌నగర్‌లో 37, మెదక్ 35.8, హైదరాబాద్‌లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వారాంతా నికి నగరంలో టెంపరేచర్‌ 35 డిగ్రీలకు చేరుకుంటుదని ఆ తర్వాత వచ్చేవారం ఆరంభంలోనే 39 డిగ్రీలను తాకవచ్చని వాతావరణ అధికారులు అంటున్నారు. వచ్చే వారం మొత్తం భానుడి దెబ్బకు చెమటలు కారడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.9 డిగ్రీలు, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని చోట్ల 12 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story