Turkey Funds Scam: టిక్ టాక్ ద్వారా విరాళాలు... అంతా ఫేక్....

Turkey Funds Scam: టిక్ టాక్ ద్వారా విరాళాలు... అంతా ఫేక్....
కొత్త దారులు వెతుకుతున్న సైబర్ మోసగాళ్లు; టిక్ టాక్ ద్వారా నిధులు సమీకరణ అంటూ కొత్త స్కామ్; జర భధ్రం అంటోన్న పోలీసులు...

ప్రపంచం మొత్తం టర్కీ-సిరియా విషాదాన్ని చూసి కంటతడిపెడుతోంది. ఆపదలో ఉన్న వారికి తమకు తోచిన సహాయం చేసేందుకు స్పందించే హృదయాలన్నీ ఒక్కతాటి పైకి వస్తున్నాయి. తమ మన బేధాలు మరచి ఆపన్న హస్తం అందిస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లకు ఇదీ ఒక అవకాశంగానే కనిపిస్తోంది. మాటలకు అందని విషాదాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. దీంతో టర్కీ రిలీఫ్ ఫండ్ పేరిట పలు ఫేక్ అకౌంట్ లు పుట్టుకువస్తున్నాయి. అలా దోచుకున్న సొమ్మును భూకంప బాధితులకు చేరకుండా నేరుగా తమ ప్లేపాల్, క్రిప్టో కెరన్సీ అకౌంట్లలో జమచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ లో పలు ఫేక్ అకౌంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. టిక్ టాక్ వినియోగదారులకు డిజిటర్ గిఫ్ట్ పేరిట పలు సందేశాలు పంపి తద్వాారా నిధులు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీబీసీ మరో వాదనకు తెరలేపింది. టిక్ టాక్ ద్వారా సేకరించిన నిధుల్లో 70శాతం ఆ సంస్థకే చేరుతుందని వెల్లడించింది. పాత ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫుటేజ్, రెస్క్యూ ఆపరేషన్ లపై టీవీ రిపోర్ట్ లతో వినియోగదారులను మభ్యపెట్టి డబ్బు దండుకునేందుకే కొన్ని అకౌంట్ల పనిచేస్తున్నాయి. లెట్స్ హెల్ప్ టర్కీ, ప్రే ఫర్ టర్కీ, డొనేట్ ఫర్ ఎర్త్ క్వేక్ విక్టిమ్స్ పేరిట కొన్ని ఫేక్ అకౌంట్ ఉత్పన్నమయ్యాయి. ఇలాంటి అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణలు హెచ్చరిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story