శభాష్ రా పిల్లలు... మీ ఇద్దరికో హాట్సాఫ్!

శభాష్ రా పిల్లలు... మీ ఇద్దరికో హాట్సాఫ్!
పొంగల్‌ కానుకగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రూ.2,500 నగదు, చెరకు, పొంగల్‌ తయారీ పదార్థాలతో పాటు బట్టలను రేషన్‌ షాపుల ద్వారా అందించింది.

పొంగల్‌ కానుకగా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు రూ.2,500 నగదు, చెరకు, పొంగల్‌ తయారీ పదార్థాలతో పాటు బట్టలను రేషన్‌ షాపుల ద్వారా అందించింది. అయితే తమిళనాడులోని కోతమంగళం గ్రామంలోని ఓ 70 ఏళ్ల వృద్ధురాలు సుబ్బలక్ష్మీ.. తన కుమార్తెకు మనోవైకల్యం కావడంతో తానే రేషన్‌ షాపుకు కాలినడకన బయలుదేరింది.


కొంత దూరం అయితే నడిచింది.. ఆ తర్వాత వృద్ధాప్యంతో ఓపిక లేకపోవడం, పైగా కాలికి గాయం కావడంతో అలసటతో ఒక చెట్టు కింద కూర్చోంది. ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురుచూసింది. కానీ ఒక్కరు రాలే.. కాసేపటికే ఓ ఇద్దరు కవలలు వచ్చి ఆ అవ్వకు సహాయం చేశారు.

స్థానికంగా అక్కడ ఉండే వనిత అనే గృహిణి మార్గమధ్యన వెళ్తూ.. ఈ వృద్ధురాలి అవస్థను గమనించింది. మానవత్వంతో సహాయం చేద్దామని అనుకుంది. తన కవల పిల్లలైన నితిన్‌, నితేశ్‌కు ఆ వృద్ధురాలికి సహాయం చేద్దామని చెప్పింది. వాళ్ళు కూడా సరే అన్నారు. దీనితో ఆ వృద్ధురాలుని తోపుడు బండిపై పడుకోబెట్టి రేషన్‌ షాపునకు తీసుకెళ్లారు.


ఆ రేషన్ షాపు దగ్గర కిందికి దించి రేషన్‌ పొందేందుకు సహకరించారు. ఆ తర్వాత మళ్ళీ అదే తోపుడు బండిపై పడుకోబెట్టి ఆమెను ఇంటికి చేర్చారు. అలా ఆ వృద్ధురాలి పండగ సంతోషంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఆ ఇద్దరు కవల పిల్లలను మెచ్చుకుంటున్నారు. శభాష్ రా పిల్లలు... మీకో హాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story