నా భర్తంటే.. నా భర్త.. ఒక్కడి కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు!

నా భర్తంటే.. నా భర్త.. ఒక్కడి కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు!
సినిమాలో ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం చూసుంటాం. నావాడంటే నావాడు అంటూ హీరో కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ చేసుకునే ఫైట్ చాలా సరదాగా ఉంటుంది.

సినిమాలో ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం చూసుంటాం. నావాడంటే నావాడు అంటూ హీరో కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ చేసుకునే ఫైట్ చాలా సరదాగా ఉంటుంది. అయితే ఇదే రియల్ లైఫ్ కి వచ్చేసరికి కథ అందుకు భిన్నంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు అతను నావాడంటే నావాడు అంటూ ఏకంగా రోడ్డుపైన్నే కొట్టేసుకున్నారు. చివరికి పోలీసులు రావడంతో ఉహించని ట్విస్ట్ బయటపడింది.

పోలీసులు వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలోని రూర్కీలోని గంగ్నహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ అంబర్ తలాబ్ నివాసి అయిన మహిళకు సదరు వ్యక్తితో పది సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకి నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే సదరు వ్యక్తి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఇక్కడ అసలు ట్విస్ట్ ఎంటంటే ఆ మహిళ ఎవరో కాదు సదరు వ్యక్తి భార్య కజిన్ సిస్టర్ కావడం.. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం భార్యభర్తలకు వివాహేతర సంబంధం విషయంపై గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. దీనితో అతను తన మరదలను తీసుకొని మీరట్ కి వెళ్లి అక్కడో గది అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భార్య అతనిపైన కేసు పెట్టింది.

ఈ నేపధ్యంలో గత శుక్రవారం సదరు వ్యక్తి మరదలుతో కలిసి రూర్కి బస్టాండ్‌లో ఉండటం చూసిన అతని భార్య గొడవకి దిగింది. తన భర్తతో ఎందుకు ఉన్నావని ప్రశ్నించింది. అందుకు ఆమె సోదరి అతడు తన భర్తని తెలిపింది. ఆ తర్వాత అతను నావాడంటే నావాడు అంటూ రోడ్డుపైనే పోటికి దిగారు. ఇదంతా చూస్తున్న స్థానికులు పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ముగ్గురిని పోలిస్ స్టేషన్ కి తీసుకువెళ్ళారు.

అయితే అక్కడ విచారణలో భాగంగా కొన్ని రోజుల క్రితమే మరదలిని పెళ్లి చేసుకున్నట్లుగా సదరు వ్యక్తి తెలిపాడు. ఇక అతడి మీద మీరట్‌లో కేసు నమోదు చేయడంతో పోలీసులు దీని గురించి వారికి సమాచారం ఇచ్చారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story