UPA : కాంగ్రెస్ కూటమిలో BRSకు స్థానం లేదట

UPA : కాంగ్రెస్ కూటమిలో BRSకు స్థానం లేదట
బీఆర్‌ఎస్‌, టీఎంసీ సహా కొన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో రాహుల్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి

కాంగ్రెస్‌ ఏర్పాటు చేయబోయే కూటమిలో బీఆర్‌ఎస్, టీఎంసీ సహా పలు పార్టీలకు స్థానం ఉండబోదంటూ రాహుల్‌ గాంధీ సన్నిహిత నేతలు కొందరు కుండబద్దలు కొడుతున్నారు.. నిన్న మేఘాలయలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతున్నారు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌పై చేసినట్లే టీఎంసీపైనా ఘాటైన విమర్శలు చేశారు రాహుల్‌ గాంధీ.. బీఆర్‌ఎస్‌, టీఎంసీ సహా కొన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో రాహుల్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.. కొన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీటింగ్‌లకు హాజరైనా మేలు చేసేది మాత్రం బీజేపీకేనని కొద్దిరోజుల క్రితం జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు.. అటు రాహుల్‌ గాంధీ కూడా జైరాం రమేష్‌ వ్యాఖ్యలను దాదాపు సమర్థించారు.. 2024లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, కాంగ్రెస్సే నాయకత్వం వహిస్తుందని రెండ్రోజుల క్రితమే మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు.


అటు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ ప్రతికూలంగా స్పందించాయి.. మరోవైపు ఖర్గే ప్రకటన చేసిన మరునాడే టీఎంసీపై రాహుల్‌ గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు.. బీజేపీకి మేలు చేసేందుకు తృణమూల్‌ పనిచేస్తోందని రాహుల్‌ ఫైరయ్యారు.. కాంగ్రెస్‌ కెప్టెన్‌గా ఉండే కూటమిలో పార్టీలు ఇవేనంటూ 16 పార్టీల పేరుతో మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ చేయగా.. ఆ 16 పార్టీల జాబితాలో టీఎంసీ, ఎస్‌పీ, బీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ పార్టీలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.. టీఎంసీ, ఎస్పీ, జేడీఎస్‌తో కలిసి కూటమి ఏర్పాటుకు కేసీఆర్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.. ఇటు చూస్తే కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి కోసం గతంలోనూ కేసీఆర్‌, మమతా బెనర్జీ ప్రయత్నాలు చేశారు.. ఇక రేపటి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.. 2024 ఎన్నికలు, కూటమి ఏర్పాటుపై ప్లీనరీ సమావేశాల్లో కీలక చర్చజరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story