Uthra murder case : పాముకాటుతో భార్యను చంపిన భర్త.. కేరళ కోర్టు సంచలన తీర్పు..

Uthra murder case : పాముకాటుతో భార్యను చంపిన భర్త.. కేరళ కోర్టు సంచలన తీర్పు..
Uthra murder case : భార్య పిల్లలు ఉండగా మరొకామెపై మనసు పడ్డాడు.. అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను పాముతో కాటు వేయించి మరీ చంపేశాడు.

Uthra murder case : భార్య పిల్లలు ఉండగా మరొకామెపై మనసు పడ్డాడు.. అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను పాముతో కాటు వేయించి మరీ చంపేశాడు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అరుదైన కేసుగా భావించిన కొల్లం అదనపు సెషన్స్ కోర్టు సూరజ్‌కు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు సూరజ్‌ను దోషిగా నిర్ధారించింది. తీర్పు ప్రకారం నేరస్థుడిగా నిర్ధారించబడినందున మొదట 17 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దోషికి కోర్టు 5 లక్షల జరిమానా కూడా విధించింది.

మరణించిన ఉత్రా తల్లి మణిమేఖల ఈ తీర్పుతో నిరాశకు గురైనట్లు చెప్పారు. "చట్టంలోని ఇటువంటి లొసుగులు సూరజ్ వంటి నేరస్థులను సృష్టిస్తున్నాయి. మేము ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాము" అని ఆమె చెప్పింది. కుటుంబానికి న్యాయం జరగలేదని వారు భావిస్తున్నారు.

సూరజ్ లాంటి కరుడుగట్టిన నేరస్థుడికి మరణశిక్ష విధించకపోతే మా కడుపుమంట ఎలా చల్లారుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది

కేసు వివరాలు..

కేరళ కొల్లాం జిల్లా అంచల్ ప్రాంతానికి చెందిన ఉత్రాకు అదే ప్రాంతానికి చెందిన సూరజ్ కుమార్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని రోజులకు మరో అమ్మాయిపై మోజు పడ్డాడు సూరజ్. అయితే భార్య ఉత్రా అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.

తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఇందుకోసం గతేడాది మే నెలలో పాములు పట్టే వ్యక్తి దగ్గర ఓ నాగుపామును తీసుకున్నాడు. ఆ తర్వాత భార్య నిద్రిస్తున్న టైమ్ చూసుకుని పామును ఆమెపైకి వదిలాడు. పాము రెండు సార్లు కాటు వేయడంతో ఉద్రా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది.

అయితే గతంలో కూడా ఉత్రా ఓసారి పాము కాటుకు గురై చికిత్స అనంతరం కోలుకుంది. ఇప్పుడు మరోసారి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఉత్రా తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే గతంలో కూడా ఉత్రా ఓసారి పాము కాటుకు గురికావడంతో ఆమె మృతిపై అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story