వరద బీభత్సం నుంచి ఇంకా తేరుకోని ఉత్తరాఖండ్‌

వరద బీభత్సం నుంచి ఇంకా తేరుకోని ఉత్తరాఖండ్‌
Uttarakhand Floods : ఒకవైపు తపోవన్-విష్ణుగడ్ జలవిద్యుత్ కేంద్రంలో వరదల్లో చిక్కుకున్నవారి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి.

వరద బీభత్సం నుంచి ఉత్తరాఖండ్‌ ఇంకా తేరుకోవడం లేదు. రోజు రోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు తపోవన్-విష్ణుగడ్ జలవిద్యుత్ కేంద్రంలో వరదల్లో చిక్కుకున్నవారి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంకో సొరంగంలోనూ కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టిన టన్నెల్‌కు 12 మీటర్ల కింద ఉన్న మరో సొరంగంలోనూ కార్మికులు చిక్కుకున్నారని NTPCకి చెందిన అధికారులు ప్రభుత్వానికి వివరించారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న టన్నెల్‌ ద్వారం నుంచి ఇది 72 మీటర్ల దూరంలో ఉంది. అయితే ప్రాజెక్టు ఇంజనీర్లను పంపించి కార్మికులు చిక్కుకున్న ప్రాంతాన్ని గుర్తించాలని, సహాయక చర్యలు చేపట్టే సిబ్బందికి సహకరించాలని ప్రభుత్వం NTPCకి సూచించింది. మరికొంతమంది కార్మికులు ఇంటేక్ ఆడిట్ టన్నెల్‌లో చిక్కుకున్నారని తెలియడంతో సహాయక బృందాలు స్ట్రాటజీని మార్చాయి. మరోవైపు నుంచి డ్రిల్లింగ్ కొనసాగించాలని ప్లాన్ చేశాయి. లైట్లతో కూడిన కెమెరాలను కూడా సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story