దేశంలో 23.28 లక్షల మందికి వ్యాక్సిన్లు

దేశంలో 23.28 లక్షల మందికి వ్యాక్సిన్లు
ఇవాళ ఒక్కరోజే 5,038 కేంద్రాల్లో 2,99,299 మంది (సాయంత్రం ఆరు గంటల వరకు) ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ పొందినట్లు వెల్లడించింది.

దేశంలో ఇప్పటివరకు 23,28,779 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 5,038 కేంద్రాల్లో 2,99,299 మంది (సాయంత్రం ఆరు గంటల వరకు) ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్‌ పొందినట్లు వెల్లడించింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇవాళ పెద్దఎత్తున టీకాలు వేసినట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం దేశ వ్యాప్తంగా 16 మంది అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 9 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. ఈ మరణాలకు వ్యాక్సిన్‌తో ఎలాంటి సంబంధం లేదంది.

Tags

Read MoreRead Less
Next Story