Varanasi : కూల్ వాటర్.. ఫ్రిజ్ లేకుండానే.. ఎలాగంటే..?

Varanasi : కూల్ వాటర్.. ఫ్రిజ్ లేకుండానే.. ఎలాగంటే..?
Varanasi : వేసవి వచ్చిందంటే చాలు అందరికీ కూల్ వాటర్ కావాల్సిందే.. దానికోసం ఫ్రిజ్ లేదా ఐస్‌, కుండను వాడుతూ ఉంటారు

Varanasi : వేసవి వచ్చిందంటే చాలు అందరికీ కూల్ వాటర్ కావాల్సిందే.. దానికోసం ఫ్రిజ్ లేదా ఐస్‌, కుండను వాడుతూ ఉంటారు.. కానీ . యూపీలోని వారణాసిలో నివసిస్తున్న ఆంచల్ సింగ్ అనే విద్యార్థి సోలార్ కూలింగ్ బాటిల్ సిస్టమ్‌ను రూపొందించి దీని ద్వారా బాటల్ లోని వాటర్ ని కూల్ చేస్తుంది.

సోలార్ కూలింగ్ సిస్టమ్ బెల్ట్ ఎలా పని చేస్తుందంటే.. ఈ పరికరంలో థర్మల్ కూలింగ్ ప్లేట్లు, చిన్న సోలార్ ప్లేటు, చిన్న ఫ్యాన్, బెల్టు ఉంటాయి. బాటిల్ కి బెల్టును చుట్టి ఎండలో ఉంచితే సోలార్ ప్లేటుతో కరెంట్ ఉత్పత్తి అయ్యి బాటిల్ లోని వాటర్ కూల్ అవుతాయి. 2 లీటర్ల నీటిని చల్లబరచడానికి 1 నుండి 2 గంటల సమయం పడుతుంది.

సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటే, నీరు అంత త్వరగా చల్లబడుతుంది. ఈ పరికరాన్ని తయారు చేయడానికి తనకి రెండు నెలల సమయం పట్టిందని, దీని తయారీకి 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు అయిందని ఆంచల్ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story