'వీధిపోటు' ఉన్న ఇల్లు కొనొచ్చా లేదా..

వీధిపోటు ఉన్న ఇల్లు కొనొచ్చా లేదా..
మంచీ చెడూ ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది. ఇంట్లో వాళ్లని వాస్తు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని ప్రశ్నించుకుంటే..

కోట్లు పెట్టి కడుతున్నారు.. వీధిపోటని ఎవరూ తీసుకోకుండా ఉంటారు. అయినా అవి సేల్ అవ్వకపోతే బిల్డర్ కూడా నష్టపోతాడు కదా.. అలాంటి వాటికి ఏవో చిన్న చిన్న పరిహారాలుంటాయి. వాటిని మరీ అంత పట్టించుకోనవసరం లేదు.. శుభ్రంగా కొనుక్కోవోయ్ అని సలహా ఇస్తుంటారు ఇలాంటి అనుమానాలు ఎవరి ముందైనా వ్యక్తపరిస్తే. ఇల్లు కొనేముందు దిక్కులు కీలక పాత్ర వహిస్తాయి.

వాస్తు ప్రకారం తీసుకున్న ఇంటిలో ఏ ఇబ్బందులు ఉండవా.. మంచీ చెడూ ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుంది. ఇంట్లో వాళ్లని వాస్తు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని ప్రశ్నించుకుంటే.. ఇలాంటివన్నీ కొన్ని నమ్మకం మేరకు నడుస్తుంటాయి. మనం వాటిని బలంగా నమ్మితే ఏ చిన్నది జరిగినా దాని వల్లే జరిగింది అని ఆలోచించాల్సి వస్తుంది.

నిజానికి కొన్ని దిక్కులలో వీధి పోటున్న ఇల్లు ఆ ఇంట్లో వారికి అమితమైన మేలు చేకూరుస్తుందని వివరిస్తున్నారు ప్రఖ్యాత వాస్తు పండితులు. మరీ ముఖ్యంగా ఉత్తర ఈశాన్యంలో ఉన్న ఇళ్లు, తూర్పు ఈశాన్యంలో ఉన్న ఇళ్లు, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం దిశలలో వీధి పోటున్న ఇళ్ళ వారికి కీడు జరగకపోగా సుఖ సంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు.

ఇక పడమర నైరుతి, దక్షిణ నైరుతి మూలల్లో వీధి పోటున్న ఇళ్లలో ఉంటున్న వారికి అనేక ఇబ్బందులు, అకాల మరణాలు సంభవిస్తాయనే అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. వీధి పోటున్న ఇళ్ల ముందు ప్రహరీకి బయటివైపు చిన్న గుడి, దేవుని బొమ్మలు పెట్టడంతో దోషం పోతుందని, ఇదొక నివారణ మార్గమని విశ్వసిస్తుంటారు.

వీధిపోటు ప్రభావం ఎప్పుడు ఉంటుంది.. మన ఇంటి ముందున్న వీధి కంటే ఎదురుగా ఉన్న వీధి వెడల్పు ఎక్కువగా ఉన్నా.. దూరం పోతున్నా వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయా వీధుల నుంచి ప్రయాణించే వాహనాలు, తిరగే జనం ఎక్కువగా ఉంటారు. ఎదురు వీధి చిన్నగా ఉన్నా, దూరం తక్కువగా ఉన్నా ప్రభావం వేరుగా ఉంటుంది. వీధి పోటుతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇతరత్రా నష్టాలు జరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. జనం రాకపోకలు, వాహన రద్దీ, తదితరాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది.

వీధిపోటున్న ఇళ్ల ముందు దేవుడి విగ్రహాలు పెట్టడం వలన కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రద్దీకి అనుగుణంగా వాహన నియంత్రణ వేగం ఉంటుంది. ఎదురుగా విగ్రహం కనిపిస్తే వాహన వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొందరి దృష్టి చెడుగా ఉంటుంది. అలాంటి వారి నుంచి చూపును మరల్చేలా చేస్తాయి దేవుడి విగ్రహాలు.

Tags

Read MoreRead Less
Next Story