గుడ్ కావ్య.. మొక్కల్లో ఉండే ప్రొటీన్స్‌తో గుడ్డు తయారు చేశారు..

గుడ్ కావ్య.. మొక్కల్లో ఉండే ప్రొటీన్స్‌తో గుడ్డు తయారు చేశారు..
రుచిలోనూ, పోషకాల విషయంలోనూ పౌల్ట్రీ గుడ్డు మాదిరిగానే ఉంటుంది. దీంతో బుర్జీ, ఆమ్లెట్ లాంటివి వేసుకోవచ్చు.

చాలా వీక్‌గా ఉన్నారు.. రోజుకో గుడ్డు తినండి అని డాక్టర్ చెబితే మేం వెజిటేరియన్ డాక్టర్ గుడ్డు తినం అనో లేదా నాకు ఆ వాసన పడదు అనో ఏవో సాకులు చెప్పి గుడ్డు తినడాన్ని తప్పించుకునే వారు చాలా మందే ఉంటారు.. అలాంటి వాళ్ల కోసమేనేమో ఐఐటీ ప్రొఫెసర్ కావ్య దశోరా మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్ పదార్థాలతో గుడ్డుని తయారు చేశారు.

ఐఐటీ దిల్లీకి చెందిన కావ్య.. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి, స్వచ్ఛమైన ప్రొటీన్ లభ్యతకు ఒక మార్గం దొరికిందని చెబుతున్నారు. మేము తయారు చేసిన గుడ్డు ద్రవ రూపంలో ఉంటుంది. రుచిలోనూ, పోషకాల విషయంలోనూ పౌల్ట్రీ గుడ్డు మాదిరిగానే ఉంటుంది.

దీంతో బుర్జీ, ఆమ్లెట్ లాంటివి వేసుకోవచ్చు. అచ్చంగా ఎగ్‌తో తయారు చేసిన టేస్టే వస్తుందని అంటున్నారు. కావ్య ఐఐటీలోని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. కొన్నేళ్లుగా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా మొక్కల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు తేవడంపైన పరిశోధనలు చేస్తున్నారు.

గుడ్డు తయారికీ ముఖ్యంగా పెసరపప్పు నుంచి ప్రొటీన్ సేకరిస్తున్నారు. ఈ మార్పు మరికొంత మందిని శాఖాహారం వైపు మళ్లేలా చేస్తుంది. తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని కావ్య అంటారు. ఈ ఆవిష్కరణకు గాను కావ్య.. ఐరాస భారతీయ విభాగం అంకుర సంస్థలకు ఈ ఏడాది తొలిసారిగా ప్రకటించిన అవార్డుతో పాటు.. రూ.3.75 లక్షల నగదు బహుమతిని అందుకున్నారు.

'ప్లాంట్‌మేడ్‌డాట్‌ఇన్' అనే వెబ్‌సైట్లో వీరి ఉత్పత్తులు దొరుకుతాయి. గుడ్డుతో పాటు పండ్లు, కూరగాయలు ఉపయోగించి చేప, చికెన్‌ని కూడా అభివృద్ధి చేస్తోంది కావ్య బృందం. త్వరలోనే అవి కూడా మార్కెట్లోకి రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story