ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి.

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన ఇంటికి సమీపంలో ఉన్న వాహనంలో పేలుడు పదార్థాలు గుర్తించారు. వాహనాన్ని తొలుత ముఖేశ్‌ భద్రతా సిబ్బంది గుర్తించినట్టు తెలుస్తోంది.

అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీ చేశాయి. ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్‌ చేశారు....? జిలెటిన్‌ స్టిక్స్‌ ఎందుకు ఉన్నాయనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అటు.. ముఖేశ్‌ నివాసం సమీపంలోని కారులో జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు.



Tags

Read MoreRead Less
Next Story