శశికళకు కొవిడ్ పాజిటివ్.. ఐసీయూలో ట్రీట్‌మెంట్

శశికళకు కొవిడ్ పాజిటివ్.. ఐసీయూలో ట్రీట్‌మెంట్
ఆమెను రెండు-మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చు”అని విక్టోరియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు.

జ్వరం, శ్వాస తీసుకోకపోవడం, దగ్గు కారణంగా బుధవారం సాయంత్రం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వికె శశికళ. గురువారం అర్థరాత్రి ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆమెకు ఇంతకుముందు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (SARI) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమెను ఆసుపత్రిలోని ICUకి మార్చారు. ఆమె తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. విక్టోరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమేష్ కృష్ణ కె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని అన్నారు. ఆమెకు టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్, హైపోథైరాయిడిజం ఉన్నాయని అన్నారు. గురువారం ఉదయం లేడీ కర్జన్ ఆసుపత్రి నుండి విక్టోరియా ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు.

ఆమెను రెండు-మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చు"అని విక్టోరియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు. ఇక్కడి పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి 2017 ఫిబ్రవరిలో నాలుగేళ్ల జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం పూర్తి కావడంతో ఆమె ఈనెల జనవరి 27 న విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story