నిలకడగా శశికళ ఆరోగ్యం

నిలకడగా శశికళ ఆరోగ్యం
అనారోగ్యంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

అనారోగ్యంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరిన శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. శశికళ స్పృహలోనే ఉన్నారని, ఆమె బీపీ, నాడి, శ్వాసరేటు సాధారణంగా ఉన్నాయని బులెటిన్లో తెలిపారు. ఆమెను రెండు-మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చునని విక్టోరియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు. కాగా ఆమెకు కరోనాకు తోడు షుగర్, శ్వాస సంబంధ సమస్యలున్నాయి. అటు శశికళ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి 2017 ఫిబ్రవరిలో నాలుగేళ్ల జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం పూర్తి కావడంతో ఆమె ఈనెల జనవరి 27 న విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story