ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం
అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే రెండున విడుదల కానున్నాయి

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా దేశం మొత్తం చూపు పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. ఇక్కడ మమతా నేతృత్వంలోని టీఎంసీ, మోదీ-షా నేతృత్వంలోని బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇరు పార్టీలు సై అంటే సై అంటూ పందెంకోళ్ల లాగా దూసుకుపోతున్నాయి. పరస్పర విమర్శలతో ప్రచారాన్ని హీట్ ఎక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసిన బెంగాల్ లో మూడో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. 31 సీట్లకు 78.52 లక్షల మంది ఓటర్లు 205 మంది అభ్యర్థుల భవితను తేల్చనున్నారు. హవ్‌డా గ్రామీణం, సుందర్బన్‌, డైమండ్‌ హార్బర్‌, బరుయ్‌పూర్‌, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాల కోసం 4 వేల 526 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ కూటమి మధ్యనే ఉంది. ఇక్కడ సీఎం పినరయి విజయన్, బీజేపీ, యూడీఎఫ్ కూటమి పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి.

అసోంలో చివరిదశ పోలింగ్‌లో 40 సీట్లలోని 337 మంది అభ్యర్థుల భవితను 79.19 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఎలాగైనా రెండోసారి విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే... అస్సాంను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజ్యోత్ ప్రయత్నిస్తోంది

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మొత్తం 10 లక్షలకుపైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది.

కరోనా వల్ల కేంద్రం ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే రెండున విడుదల కానున్నాయి


Tags

Read MoreRead Less
Next Story