నెలకు రూ.3వేలు MFలో ఇన్వెస్ట్ చేస్తే..

నెలకు రూ.3వేలు MFలో ఇన్వెస్ట్ చేస్తే..
రెగ్యులర్ ట్రేడింగ్ చేయలేని వారు మ్యూచువల్ ఫండ్ వైపు ..

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిచూపుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా యాప్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది భాగా పెరిగింది. పైగా వర్క్ ఫ్రం హోం కారణంగా చాలామంది కుటుంబసభ్యులతో చర్చించి గోల్స్ పెట్టుకుని విభిన్న మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో మార్కెట్లు కూడా మంచి ఆప్షన్ గా మారింది.

అయితే లాంగ్ టర్మ్ అవసరాలకు అనుగుణంగా మెజార్టీ యూత్ తమ పనులు చూసుకుంటూ.. రెగ్యులర్ ట్రేడింగ్ చేయలేని వారు మ్యూచువల్ ఫండ్ వైపు మళ్లుతున్నారు. అయితే నెలకు కనీసం 3వేల వరకూ ఇన్వెస్ట్ చేసేవారి కోసం నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

పదేళ్లు టార్గెట్ పెట్టుకుని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒకే ఫండ్ లో పెట్టడం సరికాదంటున్నారు. దీనిని మూడు భాగాలుగా చూసి మూడు ఫండ్స్ లో పెడితే బెటర్ అంటున్నారు. ఒక వెయ్యి రూపాయిలు నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఫండ్ లో చేయండి. మిడ్ క్యాప్ ఫండ్ లో మరో రూ.1000 ఇన్వెస్ట్ చేయండి. మరో రూ.1000 ఇంటర్నేషనల్ ఫండ్ లో పెట్టడం ద్వారా మీ గోల్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది.

అయితే ఇది నిపుణులు సలహాలు మాత్రమే. దీర్ఘకాలిక అవసరాలకు రిస్క్ తక్కువగా ఉండటానికి ఈ సలహా ఇవ్వడం జరిగింది. అయితే షార్ట్ టర్మ్ లాభాలు అధికంగా ఉండాలంటే మాత్రం ఎక్స్ పర్ట్ లను సంప్రదించవచ్చు.

Courtesy:https://www.profityourtrade.in

Tags

Read MoreRead Less
Next Story