ఒక్క కిడ్నీతో.. ఒలింపిక్స్‌లో విజేతగా..

ఒక్క కిడ్నీతో.. ఒలింపిక్స్‌లో విజేతగా..
శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు.. అది ఆమెకు ఒకటే ఉంది.. అయినా అంజు బాబీ జార్జి భారత అథ్లెటిక్స్‌కే

గమ్యం, లక్ష్యం ఒక్కటే అయినప్పుడు అవరోధాలెన్ని వచ్చినా అధిగమించేందుకు ఆత్మవిశ్వాసం తోడుగా నిలుస్తుంది. అదే వారిని విజేతగా నిలబెడుతుంది. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు.. అది ఆమెకు ఒకటే ఉంది.. అయినా అంజు బాబీ జార్జి భారత అథ్లెటిక్స్‌కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి పతకాలు తెచ్చింది. తాను సుదీర్ఘకాలం కిడ్నీ సమస్యలతో బాధపడ్డానని 43 ఏళ్ల అంజూ తాజాగా వెల్లడించింది.

పోటీలో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. ఒంట్లో ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనాలని పట్టుదలతో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ప్రపంచ క్రీడల్లో ఒకే కిడ్నీతో పోటీపడిన అతికొద్ది మందిలో తానుంటానని గర్వంగా తెలిపింది. అలెర్జీ, కాలి నొప్పి ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా ఆటపై తనకున్న అభిమానమే తనని నిలబెట్టిందని చెబుతుంది.

భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోత్సాహంతోనే అనారోగ్య సమస్యను అధిగమించి పతకాలు నెగ్గాను అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజు ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజు 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది.

2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడడంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణ పతకం సాధించింది. అంజు ట్వీట్‌పై స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ' నీ కఠోర శ్రమ, నిబద్ధతో భారత్ ప్రతిష్ట పెంచావు అని ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story