పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటాపోటీగా మేనిఫెస్టోల విడుదల

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటాపోటీగా మేనిఫెస్టోల విడుదల
మొన్న తృణముల్ కాంగ్రెస్, నిన్న బీజేపీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఓటర్లను ఆకట్టుకోడానికి పార్టీలన్నీ భారీగా నజరానాలు ప్రకటిస్తున్నాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. మొన్న తృణముల్ కాంగ్రెస్, నిన్న బీజేపీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. బంగ్లార్ దిశ పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ నేత అదిర్ రంజన్ చౌదరి విడుదల చేశారు. బీజేపీ బంగారు బంగ్లా కోసమంటూ సంకల్ప్ పత్రను విడుదల చేసింది. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వీరికంటే ముందే మమతా బెనర్జీ మేనిఫెస్టోను విడుదల చేసి కాక పెంచింది. బెంగాల్ పీఠంపై మూడోసారి కన్నేసిన దీదీ... ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పది లక్షల క్రెడిట్ లిమిట్, 4 శాతం వడ్డీతో క్రెడిట్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది.

మరోవైపు బెంగాల్‌లో వలసలు కొనసాగుతున్నాయి. ఎంపీ శిశిర్ అధికారి బీజేపీలో చేరారు. దీంతో గత ఆరు నెలల్లో బీజేపీలో చేరిన తృణముల్ ప్రముఖుల సంఖ్య 36కు చేరింది. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో ఆయన కోల్‌కతా ఓటర్‌గా మారారు. ఇంతకుముందు ఆయనకు ముంబాయిలో ఓటు ఉండేది. దాన్ని కోల్‌కతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అటు శిశిర్ కాషాయ కండువా కప్పుకోవడంతో దీదీ కన్నెర్ర చేసింది. ఆయనను, ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేసింది. వాళ్లంతా మోసగాళ్లని మండిపడింది.

మరోవైపు తమిళనాడు ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకోడానికి మిగతా పార్టీలకు దీటుగా వరాల జల్లు కురిపించింది.


Tags

Read MoreRead Less
Next Story