'ఆంటీ' అంటున్నారా.. అయితే జాగ్రత్త.. వాయించేస్తారిలా.. వీడియో వైరల్

ఆంటీ అంటున్నారా.. అయితే జాగ్రత్త.. వాయించేస్తారిలా.. వీడియో వైరల్
మోడర్న్ యువతికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉండే ఆమె ఆహార్యం ఆంటీ అంటే ఎలా తట్టుకుంటుంది.

ఏంటి నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా.. నిన్న గాక మొన్నే నాకు 40 ఏళ్లు వచ్చాయి.. అప్పుడే ఆంటీ అయిపోయానా.. షాపింగ్‌కి వచ్చిన ఓ యువతిని లెప్ట్ అండ్ రైట్ వాయించింది ఓ ఆంటీ సారీ మహిళ. అక్కడే కాదండోయ్ ఎక్కడైనా ఆంటీ అంటే అంతే సంగతులు. పెళ్లయిన ప్రతి ఒక్కరూ ఆంటీలైపోతారనుకుంటే పొరపాటు.. మోడర్న్ యువతికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉండే ఆమె ఆహార్యం ఆంటీ అంటే ఎలా తట్టుకుంటుంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఇటాలో చోటు చేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్వా చౌత్‌లో భాగంగా కొంతమంది మహిళలు బాబాగంజ్ మార్కెట్‌కు వెళ్లారు. షాపింగ్ చేస్తున్న సమయంలో వారిలో ఒకరిని ఓ యువతి ఆంటీ అని పిలిచింది. అంతే.. ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కింది. తిట్ల దండకం అందుకుంది.. ఓ దశలో కొట్టడానిక్కూడా చేయెత్తింది. నన్నే అంటీ అని పిలుస్తావా అని నానా రచ్చ చేసింది. ఆమెకు తోడుగా వచ్చిన మరో నలుగురు మహిళలు కూడా జత కలిసి అరిచి గోల చేశారు. మహిళా పోలీసులు వచ్చి ఆమె నుంచి యువతిని రక్షించాల్సి వచ్చింది. ఈ ఆంటీల గొడవని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. మీరూ చూసేయండి.


Tags

Read MoreRead Less
Next Story