Top

ఎంగేజ్‌మెంట్ పార్టీ అని పిలిచి.. హోటల్ గదిలో ఆమెపై..

మత్తులో ఉన్న ఆమెను ముగ్గురు వ్యక్తులు

ఎంగేజ్‌మెంట్ పార్టీ అని పిలిచి.. హోటల్ గదిలో ఆమెపై..
X

అన్నిటికీ పార్టీలు.. ఎంగేజ్‌మెంట్ పార్టీ ఉందని ముగ్గురమ్మాయిలను హోటల్‌కి రమ్మన్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు వెళ్లిపోయినా ఒక అమ్మాయిని ఉంచేసి మద్యం తాగించారు. మత్తులో ఉన్న ఆమెను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ముంబైలోని అంధేరి-కుర్లా రోడ్ వద్ద ఉన్న హోటల్‌లో జరిగింది.

22 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలిని నిందితులు ఎంగేజ్‌మెంట్ పార్టీకి ఆహ్వానించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ముంబైలో నివసిస్తున్న అవినాష్ పంగేకర్ నవంబర్ 8 న ఎంగేజ్మెంట్ పార్టీని నిర్వహించి, బాధితురాలితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను ఆహ్వానించారు.

పార్టీలో మద్యం సేవించమని ప్రధాన నిందితుడు పంగేకర్ తనను బలవంతం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరు అమ్మాయిలు పార్టీ నుంచి వెళ్లిపోయిన తరువాత, పంగేకర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని ఆరోపించారు.

పార్టీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను తేజస్ (25), షిషీర్ (27) గా గుర్తించారు. పోలీసుల నివేదికల ప్రకారం, దాడి జరిగిన వెంటనే బాధితురాలు తన కుటుంబానికి విషయాన్ని తెలియజేయలేదు. కుటుంబ సభ్యులు శనివారం ఈ సంఘటన గురించి తెలుసుకుని ఆదివారం పోలీసు ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES