అల్యూమినియం ఫాయల్‌ను అరిపాదాలకు చుడితే..

అల్యూమినియం ఫాయల్‌ను అరిపాదాలకు చుడితే..
కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారికి నొప్పిగా ఉన్న ప్రాంతంలో అల్యూమినియం ఫాయల్ చుట్టాలి.

చాలా మంది చపాతీలు వేడిగా ఉంచడం కోసం ఈ మధ్య వంటగదిలో కూడా అల్యూమినంయం ఫాయల్‌ను ఉపయోగిస్తున్నారు. కానీ శరీర భాగాలకు చుట్టడానికి దీన్ని ఉపయోగిస్తారని తెలియదు. ఇది వింతగా అనిపించినా అల్యూమినియం రేకు రోజువారీ రోగాలకు గొప్ప ఉపశమనంగా పని చేస్తుంది.

శరీర భాగాలను అల్యూమినియం రేకులో చుట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారికి నొప్పిగా ఉన్న ప్రాంతంలో అల్యూమినియం ఫాయల్ చుట్టాలి. దాంతో నొప్పి నుంచి కొంత ఊరట లభిస్తుంది. ఇది కాలిన గాయాల తీవ్రతను తగ్గిస్తుంది.

దుస్తులు ఇస్త్రీ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయల్ ఉపయోగించడం ద్వారా ఒకే సమయంలో రెండు వైపులా ఇస్త్రీ చేసినట్లుగా ఉంటుంది. ఇస్త్రీ చేయడం కూడా త్వరగా పూర్తవుతుంది. మొద్దుబారిన కత్తెరకు అల్యూమినియం రేకును ఉపయోగిస్తే కత్తెర పదునుగా ఉంటుంది. ఇందుకోసం ఓ పెద్ద అల్యూమినియం ఫాయల్ రేకును తీసుకుని దానిని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా చేయడంతో కత్తెర పదునెక్కుతుంది.

పగిలిన మీ పాదాలకు, మడమల నొప్పులకు అద్భుత నివారిణి అల్యూమినియం ఫాయల్. దీన్నిపాదాలకు చుట్టి ఓ గంట ఉంచాలి. ఒకసారి తీసి మళ్లీ చుట్టి ఇంకో గంట ఉంచాలి. ఇలా ఓ 7 రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. శరీరం అలసటగా ఉన్నప్పుడు అల్యూమినియం రేకు షీట్లను కొన్ని ఫ్రీజర్‌లో రెండు, నాలుగు గంటలు ఉంచాలి. ఇప్పుడు ఆ షీట్లను ముఖం మీద, కనురెప్పల మీద, బుగ్గలపైన ఉంచండి. దీంతో శరీరానికి అలసట నుంచి ఉపవమనం కలుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story