జొమాటో ఐపీఓ వచ్చేస్తోంది.. ఐపీఓలో షేరు ధర ఎంతంటే?

జొమాటో ఐపీఓ వచ్చేస్తోంది.. ఐపీఓలో షేరు ధర ఎంతంటే?

Zomato (File photo)

Zomato IPO: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటి జొమాటో. ఈ సంస్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఎంట్రీ ఓ పెద్ద సంచలనమే సృష్టించింది.

Zomato IPO: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఒకటి జొమాటో. ఈ సంస్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఎంట్రీ ఓ పెద్ద సంచలనమే సృష్టించింది. జొమాటో సంస్థ తమ యాప్‌ ద్వారా రెస్టారెంట్లను, వినియోగదారులను కనెక్ట్ చేసే ప్లాట్‌ఫామ్ ఇది. కస్టమర్ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే నేరుగా రెస్టారెంట్‌కు ఆర్డర్ వెళ్తుంది. రెస్టారెంట్ ఫుడ్ ప్యాక్ చేసిన తర్వాత డెలివరీ పార్ట్‌నర్ కస్టమర్‌కు అందిస్తారు. ఇటీవలే ఈ సంస్ధ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు(ఐపీఓ)రాబోతున్నట్లు ప్రకటించింది. జోమాటో ఐపీఓ సంబంధించిన డేట్ కూడా ముందుగానే తెలిపింది. జూలై 14న అంటే మరో రెండు రోజుల్లో జొమాటో ఐపీఓ సబ్‍స్క్రిప్షన్ ప్రారంభించటానికి ముందే ఆన్‌లైన్ కిరాణా డెలివరీలో అడుగుపెడుతున్నట్ల ప్రకటన చేసింది. జొమాటో ఐపీఓ ప్రకటించినప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఐపిఓపై ప్రభుత్వ అనుబంధ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.

ఇక జొమాటో ఐపీఓ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రభుత్వానుబంధ సంస్థ ఎల్ఐసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వారంలో బిడ్ దాఖలు చేయాలని చూస్తోందని ఓ ఆంగ్ల మీడియా తన కథనంలో పేర్కొంది. ఎల్‌ఐసీ సాధారణంగా సెకండరీ కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతుంది. అయితే ఈ సంస్థ జొమాటో వంటి దిగ్గజ సంస్ధల్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇది అరుదైన చర్యగా నిపుణులు అంటున్నారు. దీని కోసం ఎల్ఐసీ రూ.9,375 కోట్లు పెట్టుబడి పెట్టనుందని తెలుస్తోంది. ఇదే అంశంపై ఎల్ఐసీ ఇన్వెస్టర్లు త్వరలోనే సమావేశం కానున్నారని.. ఈ సమావేశంలో జొమాటో ఐపీఓలో పెట్టుబడి పెట్టే అంశంపై చర్చించనున్నారని సమాచారం. అయితే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీల వైపు మొగ్గుచూపారని రెడ్‌సీర్ కన్సల్టింగ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 2025 నాటికి ఆన్‌లైన్ కిరాణా మార్కెట్ స్థూల వస్తుల విలువ (జిఎమ్‌వి) 24 బిలియన్ డాలర్లుపైనే ఉంటుందని అంచనా వేసింది.

మరోవైపు జొమాటో ఐపీఓ రూ.9,375 కోట్లు సేకరిస్తుందని సమాచారం. జూలై 14న అంటే మరో రెండు రోజుల్లో జొమాటో ఐపీఓ సబ్‍స్క్రిప్షన్ ఆరంభమై.. జూలై 16న సబ్‍స్క్రిప్షన్ ముగుస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ ఐపీఓ అలాట్‌మెంట్ 2021 ఈ నెల 22న జరుగుతుంది. రీఫండ్స్ జూలై 23న వస్తాయి. డీమ్యాట్ అకౌంట్‌లో జొమాటో షేర్స్ జూలై 26న క్రెడిట్ అవుతాయి. జూలై 27న జొమాటో ఐపీఓ లిస్ట్ అవుతాయని సంస్ధ ప్రకటించింది. ఫ్రెష్ ఇష్యూ ద్వారానే రూ.9,000 కోట్లు, ఇన్ఫో ఎడ్జ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.375 కోట్లు ఈ సంస్థ సేకరించనుంది. ఇక ఇన్ఫోఎడ్జ్ జొమాటోలో అతిపెద్ద షేర్‌హోల్డర్. దీనిలో 18.68 శాతం వాటా ఉంది. మరోవైపు జోమాటో షేర్ల ఇష్యూ రూ. 72 నుంచి 76 చొప్పున ఉండనున్నట్లు తెలుస్తుంది. జోమాటో స్థానిక కిరాణా రిటైలర్లను భాగస్వామిగా చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కిరాణా రిటైలర్లను భాగస్వామిగా చేర్చుకుంటే దేశంలో అతిపెద్ద సంస్థగా జొమాటో నిలుస్తోందనే విషయంలో సందేహం లేదు. గత 16 నెలల్లో ఎస్‌బీఐ కార్డ్ ఐపీఓ తర్వాత ఇదే అతిప్దెద ఐపీఓ.

జొమాటో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఒక షేర్‌పై రూ.16 నుంచి రూ.26 వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఐపీఓ హయ్యర్ ప్రైస్ బ్యాండ్ రూ.76 ప్రకారం 21 నుంచి 26 శాతం వరకు ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది..ఇదే సమయంలో మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ప్రీమియం మారే అవకాశం ఉంటుంది. జొమాటో ప్రస్తుతం దేశంలోని 525 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తోంది. 3,89,932 యాక్టీవ్ రెస్టారెంట్స్ జొమాటోలో ఉన్నాయి. ప్రతీ నెల 32 మిలియన్లు అంటే 3.2 కోట్ల యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. 2021 మార్చి నాటికి రూ.816.43 నష్టాలను పోస్ట్ చేసింది కంపెనీ. రెవెన్యూ రూ.1,993.78 కోట్లు వచ్చినట్లు తెలిపింది. మొత్తానికి జొమాటో ఐపీఓ రాకముందే మార్కెట్ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది.

Tags

Read MoreRead Less
Next Story