Bald Head: బట్టతల అని పిలవడం లైంగిక వేధింపుతో సమానం.. ట్రైబ్యునల్ తీర్పు..
Bald Head: బట్టతల ఉండడం వల్ల కొందరు అదే పేరుతో పిలుస్తుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

Bald Head: బట్టతల.. ఈరోజుల్లో చాలామంది మగవారిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య. అయితే ఈ సమస్య మానసికంగా కూడా మగవారిపై ఎఫెక్ట్ చూపిస్తుందని ఇప్పటికే ఎన్నో అధ్యాయనాలు తెలిపాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి వేసిన పిటీషన్ వల్ల ఇంగ్లండ్‌కు చెందిన ఓ ట్రైబ్యునల్ బట్టతలపై ఓ కీలక తీర్పునిచ్చింది. ఇది మగవారికి ఎంతో ఉపయోగపడేలాగా ఉందని వారు భావిస్తున్నారు.
బట్టతల ఉండడం వల్ల కొందరు అదే పేరు పెట్టి పిలుస్తుంటారు. దీంతో వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. తాజాగా బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేసే వ్యక్తి తన సూపర్‌వైజర్‌పై ఓ పిటీషన్ దాఖలు చేశాడు. 24 ఏళ్లుగా తాను ఆ కంపెనీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నానని.. సూపర్‌వైజర్ తనను బట్టతల అని పిలుస్తూ వేధిస్తు్న్నాడని పిటీషన్‌లో పేర్కొన్నాడు ఆ వ్యక్తి.
దీనికి ట్రైబ్యునల్ శుక్రవారం తీర్పును వెల్లడించింది. పురుషులను బట్టతల పేరుతో పిలవడం అవమానించడమా, లైంగికంగా వేధించడమా అన్నదానిపై చర్చ జరిగింది. చివరికి దీనిని లైంగిక వేధింపులాగానే పరిగణించాలని ట్రైబ్యునల్ భావించింది. బట్టతల అని పిలవడం వల్ల వ్యక్తి గౌరవం దెబ్బతింటుందని, దాని వల్ల వారు భయాందోళనకు గురవుతారని ట్రైబ్యునల్ భావించింది. అందుకే పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కంపెనీకి సూచించింది.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT