Dubai: భార్యకు విడాకులిచ్చాడు.. రూ.5,500 కోట్లు భరణం కట్టాలన్నారు..

Dubai: భార్యకు విడాకులిచ్చాడు.. రూ.5,500 కోట్లు భరణం కట్టాలన్నారు..
Dubai: విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం ఇవ్వాలన్న రూల్ ప్రతీదేశంలో ఎప్పటినుండో ఉంది.

Dubai: విడాకులు తీసుకుంటే భార్యకు భర్త భరణం ఇవ్వాలన్న రూల్ ప్రతీదేశంలో ఎప్పటినుండో ఉంది. భార్య, భర్తలు ఇద్దరు విడాకులకు ఒప్పుకున్న తర్వాత.. భర్త ఆస్తిలో సగం కచ్చితంగా భార్యకు లభించాలన్న రూల్ కూడా ఉంది. కానీ ఆస్తిలో సగమైనా ఇవ్వచ్చు.. లేదా విడిపోయిన తర్వాత భార్య బతకడానికి సరిపడా డబ్బును అయినా ఇవ్వచ్చు అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఆ ఇచ్చే డబ్బునే భరణం అంటాం. ప్రపంచంలోనే అతి ఎక్కువ భరణం అందుకున్న మహిళగా దుబాయ్ ప్రధాని మాజీ భార్య రికార్డ్ అందుకుంది.

దుబాయ్ ప్రధాని, పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ తన భార్య హయా బింట్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విడాకుల కేసును లండన్ కోర్టు ముందు ఉంచారు. అయితే లండన్ కోర్టు షేక్ మహమ్మద్‌కు ఊహించని ట్విస్టే ఇచ్చింది. తన భార్య హయా బింట్‌కు భరణంగా ఏకంగా 550 మిలియన్ల పౌండ్లు చెల్లించాలని తీర్పును ఇచ్చింది. అంటే భారతీయ కరెన్సీలో ఏకంగా రూ. 5,500 కోట్లు.

లండన్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్‌గా రికార్డ్ అందుకుంది. షేక్ మహమ్మద్ బిన్ రషీద్.. జోర్డన్ పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరిని, దుబాయ్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె హయా బింట్‌ను చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి 14 ఏళ్ల కూతురు, తిమిదేళ్ల కొడుకు ఉన్నారు. అయితే ముందుగా రూ. 5,550 కోట్లలో హయా బింట్‌.. రూ.2,526 కోట్లను అందుకోనుంది. మిగతా మొత్తాన్ని అందించడానికి లండన్ కోర్టు షేక్ మహమ్మద్‌కు మరికాస్త సమయాన్ని ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story