Europe: యూరప్‌లో పడగవిప్పిన కరువు.. 500 ఏళ్లకు ఒకసారే..

Europe: యూరప్‌లో పడగవిప్పిన కరువు.. 500 ఏళ్లకు ఒకసారే..
Europe: 500 ఏళ్లకోసారి వచ్చే కరువు ఈసారి యూరప్ ఖండాన్ని కప్పేసింది.

Europe: 500 ఏళ్లకోసారి వచ్చే కరువు ఈసారి యూరప్ ఖండాన్ని కప్పేసింది. ఎప్పుడూ కళకళలాడే నదులు ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి. ఎండి వేడిమికి అడవులు తగలబడిపోతున్నాయి. యూరప్‌లోని సగానికిపైగా దేశాల్లో కరువు కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్ లో గత రెండు నెలలుగా చుక్క వర్షం లేదు. నీళ్లు లేక వ్యవసాయం దెబ్బతింది. పశువులకు మేత లేక పాల దిగుబడి పడిపోయింది.

చివరికి తాగేందుకు నీరు కూడా లేక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఆహార పదార్ధాలు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంగ్లండ్ లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రాభావితంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యూర‌ప్ స‌మాజం తీవ్ర దుర్భిక్ష ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. క‌నీస సౌక‌ర్యాలు కూడా అంద‌క జనాలు అల‌మ‌టిస్తున్నారు. దాంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకోవాలని యూనియన్ ప్రజలను కోరింది అక్కడి ప్రభుత్వం. కొన్ని కీటకాలను తినడం 'సురక్షితమైనదేన‌ని ' వాటిలో అధిక ప్రోటీన్లు, ఫైబర్లు,విటమిన్లు ఉంటాయ‌ని వరస ట్వీట్ల‌ను చేస్తూ ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నించింది. మరోవైపు తీవ్ర కరువు ప్రభావంతో మంచి నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది బ్రిటన్. ఈస్ట్ ఆఫ్రికా, పశ్చిమ అమెరికాతో పాటు ఉత్తర మెక్సికోలోనూ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి.

దీంతో పశువులు తాగే నీళ్లపైనా రోజుకు వంద లీటర్లు అంటూ బ్రిటన్ పరిమితి విధించింది. ఎప్పుడూ నిండుగా ప్రవహించే బ్రిటన్ లోని థేమ్స్ నడి ఎండిపోతోంది. ఇక ఫ్రాన్స్ లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2100 గాలన్లు నీరు ప్రవహించేది. కానీ ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చేపలు గుట్టలు గుట్టలుగా చనిపోతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో ఎండవేడిమికి కార్చిచ్చులు ఎగిసిపడుతున్నాయి. రికార్డు స్థాయి ఎండలకు జనం బెంబేలెత్తుతున్నారు. మొత్తంగా యూరప్ లో సగ భాగాన్ని కరువు కమ్మేస్తోంది.

ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్నోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటాయి. ఎండ దంచికొడుతోంది. ఇక ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా మెక్సికోల్లో కూడా కనిపిస్తున్నాయి. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు అక్కడి అధికారులు. ఎప్పుడూ వర్షాలతో తేమగా ఉండే యూరప్ ఇలా కరువుతో అల్లాడిపోవడం చూసి ప్రపంచ అవాక్కు అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story