James Webb Space Telescope: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. దీంతో భూమిపై మానవ జీవనానికి సమాధానాలు..
James Webb Space Telescope: నాసా ఎన్నో కొత్త ప్రయోగాలను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించలేని మార్పులను తీసుకొచ్చింది.

James Webb Space Telescope: ఇప్పటివరకు నాసా ఎన్నో కొత్త ప్రయోగాలను చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించలేని మార్పులను తీసుకొచ్చింది. టెక్నాలజీ ఎంత పరివర్తన చెందినా కూడా ఇంకా ఏం చేస్తే మెరుగుపడుతుంది అనేదానిపై నాసా పరిశోధకులు ఎప్పుడూ కృషి చేస్తుంటారు. తాజాగా మరో ప్రయోగానికి నాసా సిద్ధమయ్యింది. త్వరలోనే మరో అధునాతన టెక్నాలజీని మన ముందుకు తీసుకురానుంది.
ఇప్పటికే నాసా ప్రవేశపెట్టిన ఎన్నో శాటిలైట్స్ భూమి మీద ఉండే ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్' (James Webb Space Telescope) పేరుతో మరో టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపనుంది నాసా. ఒక రౌండ్ గాజుముక్క ఆకారంలో ఉండే ఈ వెబ్ టెలిస్కోప్ ప్రయాణం ఇంకా స్పేస్‌లోకి మొదలు కాకముందే అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
21 అడుగుల పొడుగు ఉండే ఈ వెబ్ టెలిస్కోప్ తయారీకి 10 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది నాసా. ప్రపంచంలోని అతిపెద్ద రాకెట్స్‌లో ఒకటైన ఏరియెన్ 5లో కూడా ఈ వెబ్ టెలిస్కోప్ సరిపోదు. నాసాతో పాటు 'యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ' కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారీలో కీలక పాత్ర పోషించింది. డిసెంబర్ 24లోపు ఈ టెలిస్కోప్‌ను స్పేస్‌లోకి పంపించాలని నాసా ప్రయత్నిస్తోంది.
అసలు భూమిపైనే మానవ జీవనం ఎందుకు మొదలయ్యింది, ఇంత పెద్ద విశ్వంలో మనిషి భూమిపైన మాత్రమే ఎలా బ్రతకగలుగుతున్నాడు అన్న అంశాలను తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉపయోగపడనుంది. కేవలం భూమి గురించే కాదు.. ఈ వెబ్ టెలిస్కోప్ ఇతర గ్రహాల గురించి కూడా స్టడీ చేసి వాటి సమాచారాన్ని నాసాకు అందిస్తుంది.
RELATED STORIES
Kushi 2022: షూటింగ్లో విజయ్, సామ్‌కు గాయాలు.. క్లారిటీ ఇచ్చిన...
24 May 2022 11:00 AM GMTPawan Kalyan: కొడుకు అకీరా నందన్‌తో పవన్.. రేణు దేశాయ్ ఎమోషనల్...
24 May 2022 10:25 AM GMTRGV: డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులు.. వర్మపై ఛీటింగ్ కేసు..
24 May 2022 9:30 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMT