Gold Cube: అది కేవలం ఒక క్యూబ్.. కానీ దాని విలువ రూ. 87 కోట్లు..

Gold Cube: అది కేవలం ఒక క్యూబ్.. కానీ దాని విలువ రూ. 87 కోట్లు..
Gold Cube: న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో ఓ క్యూబ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Gold Cube: మామూలుగా కళాకారుల కళకు చాలా విలువ ఉంటుంది. అది పెయింటింగ్ అయినా, ఆర్ట్ అయినా.. వాటి విలువ కనీసం లక్షల్లో ఉంటుంది. ఆ ఆర్ట్ అందరికీ అర్థం కాకపోయినా కూడా దాని విలువ ఏ మాత్రం తగ్గదు. అలాగే కేవలం ఓ క్యూబ్ విలువ ఏకంగా 11.7 మిలియన్ల డాలర్లట. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 87 కోట్లు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా.?

న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో ఓ క్యూబ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే అది మామూలు క్యూబ్ కాదు.. ప్యూర్ గోల్డ్ క్యూబ్. జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో ఈ గోల్డ్ క్యూబ్‌ను 4,500 కష్టపడి తయారు చేశాడు. పైగా ఈ క్యూబ్ మొత్తం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌తోనే తయారుచేయబడింది. అయితే దీనిని సెంట్రల్ పార్క్‌లో ప్రెజెంట్ చేయడానికి కూడా ఓ పెద్ద కారణమే ఉంది.

నిక్లాస్.. క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో రాణించాలని కలలు కంటున్నాడు. అయితే దీనికి ప్రమోషన్స్ ఎలా చేయలి అని ఆలోచిస్తుండగా.. తనకు ఈ గోల్డ్ క్యూబ్ ఆలోచన వచ్చింది. చాలామంది సందర్శకులు వచ్చి ఈ గోల్డ్ క్యూబ్‌ను చూసి, దీని ధర గురించి మాట్లాడుతూ ఉండగా నిక్లాస్ వ్యాపారానికి ప్రమోషన్స్ జరిగినట్టు అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గోల్డ్ క్యూబ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story