John Gonsalves: వరల్డ్ వార్ సమయంలో రాసిన లేఖ.. 76 ఏళ్ల తర్వాత మజిలీ చేరింది..

Angelina Gonsalves (tv5news.in)

Angelina Gonsalves (tv5news.in)

John Gonsalves: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నుండి యుద్ధం కోసం జర్మనీ వెళ్లాడు జాన్ గాన్‌సేల్వ్స్ అనే ఓ సైనికుడు.

John Gonsalves: ఇప్పటివరకు రెండు పెద్ద ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అందులో చాలామంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిలాగా అప్పట్లో వారి ఇంటివాళ్లతో మాట్లాడడానికి పెద్దగా సోర్స్ ఉండేది కాదు సైనికులకు. ఇప్పటికీ.. సైనికులు వారి కుటుంబంతో మాట్లాడాలంటే ఎన్నో ఆంక్షలు. అందుకే వారికి లేఖలు మాత్రమే సమాచారం చేరవేసేందుకు ఉపయోగపడేవి. అలా 76 ఏళ్ల క్రితం రాసిన ఓ లేఖ ఇన్నాళ్లకు మజిలీ చేరింది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా నుండి యుద్ధం కోసం జర్మనీ వెళ్లాడు జాన్ గాన్‌సేల్వ్స్ అనే ఓ సైనికుడు. అతడు అప్పట్లో తరచుగా తన తల్లికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అలాగే తాను అప్పుడు రాసిన ఓ లేఖ ఇన్నాళ్లకు ఇంటికి చేరుకుంది. పిట్స్‌బర్గ్‌లోని ఓ పోస్టల్ సర్వీస్ ఆఫీస్‌లో ఈ లెటర్ 76 ఏళ్లుగా ఓపెన్ చేయకుండా ఉండడాన్ని గమనించిన అధికారులు దీనిని ఎట్టకేలకు జాన్ వాళ్ల ఇంటికి చేర్చారు.

జాన్ గాన్‌సేల్వ్స్ తల్లి మరిణించింది. 2015లో జాన్ కూడా కన్నూమూశాడు. అయితే ఈ లేఖ జాన్ భార్య ఏంజెలీనాకు అందించింది అమెరికా పోస్టల్ డిపార్ట్‌మెంట్. ఆ లేఖలో 'అమ్మా.. ఈరోజు నేను నీ నుండి మరో ఉత్తరాన్ని అందుకున్నాను. అక్కడ అంతా క్షేమంగా ఉందని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆహారం తప్పా అంతా బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను' అని రాశాడు జాన్.



ఈ లెటర్‌ను జాన్ ఇంటికి అందజేయడం ముఖ్యం అనుకున్న అమెరికా పోస్టల్ డిపార్ట్‌మెంట్.. స్వయంగా ఓ అధికారిని పంపించి ఏంజెలీనాకు ఈ ఉత్తరాన్ని అందజేశారు. తాను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని, 76 ఏళ్లు అంటే మామూలు విషయం కాదని ఏంజెలీనా తెలిపింది. ఎందుకో ఇప్పుడు జాన్ మళ్లీ తన దగ్గరకు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోందని ఏంజెలీనా భావోద్వేగానికి లోనయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story