Sri Lanka : గొటబయ రాజపక్స రాజీనామా.. సంబరాల్లో శ్రీలంక ఆందోళనకారులు

Sri Lanka : గొటబయ రాజపక్స రాజీనామా.. సంబరాల్లో శ్రీలంక ఆందోళనకారులు
Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా ఎట్టకేలకు రాజీనామా చేశారు.

Sri Lanka Crisis : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా ఎట్టకేలకు రాజీనామా చేశారు. సింగపూర్ చేరుకున్న తర్వాత తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. చివరి గొటబాయ రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో సంబరాలు జరుపుకుంటున్నారు.

మరోవైపు ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతుండటంతో .. దేశంలో ఎమర్జెన్సీ విధించారు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె. ఈనెల 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉన్న నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. సింగపూర్ చేరుకున్న తర్వాత తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. శ్రీలంక నుంచి మాల్దీవుల చేరుకున్నాన గొటబాయ.... అక్కడి నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎస్వీ 788లో సింగపూర్‌ చాంగీ విమానాశ్రయం చేరుకుని.. అక్కడినుంచి ఓ హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత.. శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. గొటబాయ నుంచి లేఖ అందినట్లు నిర్ధారించిన స్పీకర్‌... ఈ మేరకు ప్రకటన చేశారు..

గొటబాయ రాజపక్స రాజీనామా చేశాడని ప్రకటన రావడంతో.. శ్రీలంక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణా సంచా కాలుస్తూ.. డాన్సులు వేశారు. గొటబాయ రాజీనా చేయడంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఆందోళనకారుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె. పార్లెమెంట్ భవనం ఎదుట భారీగా యుద్ధ ట్యాంకర్లు మోహరించారు. పోలీసు, ఆర్మీ, బ్లాక్ కమాండర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే.. గరిష్టంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్‌ కొనసాగవచ్చు. ఆ లోపు పార్లమెంట్‌ తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నికోవాలి.

ఈ నెల 20న పార్లమెంట్‌లో నూతన అధ్యక్షుడి ఎన్నికల జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉన్న నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

మరోవైపు... గొటబాయ రాజపక్స తప్పుకోవడంతో... జాతీయ ఐక్యతా ప్రభుత్వానికి తానే సారథిననంటున్నారు ప్రతిపక్షనేత సమాజి జన బలవేగయ నేత సజిత ప్రమోద దాస. తనకు ఇతర పార్టీల మద్దకు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో... సజిత ప్రమోద దాసే తదుపరి అధ్యక్షుడి అయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags

Read MoreRead Less
Next Story