Lebanon: ఆ దేశంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే తొమ్మిదేళ్లు వస్తే చాలు..

Lebanon: ఆ దేశంలో అమ్మాయికి పెళ్లి చేయాలంటే తొమ్మిదేళ్లు వస్తే చాలు..
Lebanon: పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం అడ్డంకిగా మారకుండా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

Lebanon: ఒకప్పుడు ఆడవారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అంత స్వేచ్ఛ ఉండేది కాదు, పై చదువులు చదువుకునేంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఆఖరికి తమ జీవితం గురించి తామే సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. అందుకే కేంద్రమే వారి తరపున అమ్మాయిల పెళ్లి వయసును నిర్ణయించింది. అమ్మాయిలకు 18 ఏళ్లు వచ్చేవరకు పెళ్లి చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పుడు అదే పెళ్లి వయసులో మరిన్ని మార్పులు చేసింది.

అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి కావడం వల్లే ఎక్కువగా శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావించింది. ప్రస్తుతం కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. కాగా ఈ వయసును మూడేళ్లు పెంచాలని కేంద్రం యోచించింది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురానుంది.

అయితే ఒక్కో దేశంలో అమ్మాయి పెళ్లి వయసును ఆయా దేశాలు ఎలా నిర్ణయించాయంటే.. ఇరాన్‌లో 13 ఏళ్లు.. చాద్, కువైట్ దేశాల్లో 15 ఏళ్లు.. అఫ్గానిస్తాన్, పాకిస్థాన్, కతార్, యూకే దేశాల్లో 16 ఏళ్లు.. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ, బ్రెజిల్, శ్రీలంక దేశాల్లో 18 ఏళ్లు.. చైనా, జపాన్, నేపాల్, థాయిలాండ్‌లో 20 ఏళ్లు.. లెబనాన్ దేశంలో మాత్రం 9 ఏళ్లు వస్తే చాలు.. అమ్మాయికి పెళ్లి చేసేయవచ్చనే నిబంధన ఉంది.

Tags

Read MoreRead Less
Next Story