India vs Westindies: వరుణుడి రాకతో 2వ టెస్ట్ డ్రా, సిరీస్‌ భారత్‌దే

India vs Westindies: వరుణుడి రాకతో 2వ టెస్ట్ డ్రా, సిరీస్‌ భారత్‌దే
5వ రోజు వర్షం కారణంగా మ్యాచ్ మొదలవ్వలేదు. దీంతో అంపైర్లు ఆటని డ్రాగా ప్రకటించారు. దీంతో 2 మ్యాచుల టెస్ట్ సిరీస్‌ని భారత్ 1-0తో కైవసం చేసుకున్నట్లయింది.

India vs Westindies: విండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 5వ రోజు వర్షం కారణంగా మ్యాచ్ మొదలవ్వలేదు. దీంతో అంపైర్లు ఆటని డ్రాగా ప్రకటించారు. దీంతో 2 మ్యాచుల టెస్ట్ సిరీస్‌ని భారత్ 1-0తో కైవసం చేసుకున్నట్లయింది. 5వ రోజు మ్యాచ్ జరిగి ఉంటే భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి ఉండే అవకాశం ఉండేది.

4వ రోజు వేగంగా ఆడిన భారత్ రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల అర్ధసెంచరీలతో విండీస్‌కి 365 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. లక్ష్యఛేదనలో 75 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కానీ ఆట డ్రాగా ముగియడంతో భారత్‌కి నిరాశే ఎదురైంది. 5 వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. స్పిన్నర్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ఇక భారత్ మళ్లీ టెస్ట్ మ్యాచులు ఆడేది డిసెంబర్‌లోనే. ఆ మాసంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుత విండీస్‌ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఈ నెల 27న ఆరంభమవనుంది. ఈ నెల 29న 2వ వన్డే, ఆగస్ట్ 1న చివరి వన్డేలు జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story