ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ (IAF) 255 గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 13 దరఖాస్తుకు చివరి తేదీ. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

అర్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వేతననం.. లెవల్ -1 పోస్టులకు రూ.18,000, లెవెల్-2 పోస్టులకు రూ.19,900, లెవెల్-4 పోస్టులకు రూ.25,500 ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్ధులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. దానిని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

ముఖ్య సమాచారం:

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 11, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 13, 2021

పరీక్ష తేదీ: ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు

వయసు: 18 నుంచి 25 ఏళ్లు

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianairforce.nic.in/

Tags

Read MoreRead Less
Next Story