పీఎంకేవీవై కొత్త స్కీమ్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం

పీఎంకేవీవై కొత్త స్కీమ్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం
దీనిలో 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ తీసుకోవచ్చు.

నిరుద్యోగులకు భారీ ఊరట కలిగించే ఓ కొత్త స్కీమ్.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0.. అభ్యర్ధులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. దీనిలో 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ తీసుకోవచ్చు.

2020-21లో 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం జిల్లాల్లో స్కిల్స్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా యువతకు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు. దీని వలన యువత వారికి నచ్చిన రంగంలో ఉపాధి పొందొచ్చు.

ఆసక్తిగల యువతీ యువకులు https://pmkvyofficial.org/ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ పేరు రిజిస్టర్ చేసుకుని ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ అనంతరం ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తారు.

మధ్యలో చదువు మానేసిన వారు, నిరుద్యోగులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ (pmkvy) స్కీమ్ పని చేస్తుంది. దీని కోసం ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.

Tags

Read MoreRead Less
Next Story