కేన్సర్ పేషెంట్లకు కొవిడ్ శాపం

కేన్సర్ పేషెంట్లకు కొవిడ్ శాపం
రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సిన కేన్సర్ పేషెంట్లు లాక్‌డౌన్లు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో కేన్సర్ రోగులు

రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సిన కేన్సర్ పేషెంట్లు లాక్‌డౌన్లు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో కేన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేసుల్లో పరిస్థితి విషమించి కేన్సర్ అడ్వాన్స్ దశకు చేరుకుంటున్నట్లు వైద్యులు గుర్తించారు. కేన్సర్ బారిన పడినవారిలో 20 శాతం మంది కరోనా కారణంగా చికిత్సకు దూరమైనట్లు వైద్యులు చెబుతున్నారు. కేన్సర్ ను నియంత్రించడంలో కిమో, రేడియో థెరపీలు కీలకం. కీమో థెరపీని ఐదు నుంచి 11 సార్లు నిర్వహిస్తారు. రేడియో థెరపీ 5 నుంచి 11 వారాల సమయం పడుతుంది. ఈ థెరపీల ద్వారా కేన్సర్ వ్యాప్తి మిగతా శరీర భాగాలకు విస్తరించకుండా ఉంటుంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయ ముప్పు ఏర్పడుతుంది. కరోనా నేపథ్యంలో ఆస్పత్రిలో సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రమాదకర కేన్సర్లయిన రొమ్ము, నోటి కేన్సర్, బ్లడ్ కేన్సర్, జీర్ణకోశ, కాలేయ, గర్భాశయ ముఖద్వార కేన్సర్లు చాలా ప్రమాదకరం. కరోనా వల్ల కేన్సర్ చికిత్సకు దూరమవుతున్న వారిలో ఈ కేటగిరి వారే అధికంగా ఉన్నారు. ఇలాంటి కేన్సర్లను ఆరంభంలోనే గుర్తించి చికిత్స అందించకపోతే ఇతర అవయవాలకు కేన్సర్ సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story