Gun Culture : అమెరికా మరోసారి కాల్పుల మోత, 8మంది మృతి

Gun Culture : అమెరికా మరోసారి కాల్పుల మోత, 8మంది మృతి

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో చొరబడ్డ ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు.. షూటర్‌ను హతమార్చారు. బుల్లెట్‌ గాయాలతో విలవిలలాడుతున్న వారిని సమీపంలోని మెడికల్‌ సిటీ హెల్త్‌కేర్, డల్లాస్-ఏరియా ఆస్పత్రులకు తరలించారు. ఊహించనివిధంగా ఒక్కసారిగా దుండగుడు కాల్పులకు తెగబడడంతో.. మాల్‌లో అందరూ భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. మరికొందరు షూటర్‌ కంటపడకుండా దాచుకున్నారు. మరికొందరు అభాగ్యులు మాత్రం ఉన్మాది తూటాలకు చిక్కారు. పోలీసులు షూటర్‌ను కాల్చేసిన తర్వాత వందలాది మంది మాల్‌ నుంచి బయటకు వచ్చారు.
గన్‌ కల్చర్‌ అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడపాదడపా ఉన్మాదులు తుపాకులతో రెచ్చిపోతున్నారు. పిల్లలు.. మహిళలు అన్న తేడా లేదు.. కన్పించినవారిన్నల్లా పిట్టల్లా కాల్చేస్తున్నారు. స్కూళ్లు.. కాలేజీలు.. యూనివర్సిటీలు.. పబ్‌లు.. క్లబ్‌లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. కాల్పులకు తెగబడుతూ.. జనం ప్రాణాలు విడిస్తుంటే వికృతానందం పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story