తాజా వార్తలు

నానో కారులో బేకరీ.. 12 స్టోర్లతో వ్యాపారం

నేహా ఆర్య సేథి వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పట్టా పొందిన తరువాత, న్యూయార్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఒక

నానో కారులో బేకరీ.. 12 స్టోర్లతో వ్యాపారం
X

నేహా ఆర్య సేథి వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పట్టా పొందిన తరువాత, న్యూయార్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఒక సంవత్సరం పనిచేసింది. మంచి వేతనం వస్తున్నా చేస్తున్న పని పట్ల సంతృప్తి లేదు. ఆఖరికి ఫైనాన్స్ తనకి సూటయ్యే జాబ్ కాదని గ్రహించింది. తిరిగి భారతదేశానికి వచ్చి తనకి నచ్చిన బేకింగ్ ఉత్పత్తుల పని ప్రారంభించాలనుకుంది. చిన్నప్పటి నుండి నేహ డెజర్ట్‌ల అభిమాని. ఆమె తనని తాను బిజీగా ఉంచుకునేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం బేకరి ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. అయితే మొదట్లో దానిని వ్యాపారంగా మార్చాలనే ఆలోచన ఆమె మనసులో ఎంత మాత్రం లేదు. వ్యాపారం చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకుంది.

నీకిష్టమైన బేకింగ్ నే కెరీర్ గా ఎందుకు మలుచుకోకూడదు అని తన చిన్ననాటి స్నేహితుడు సలహా ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచించడం ప్రారంభించింది. అది కూడా వినూత్నంగా వ్యాపారం ప్రారంభిస్తే వినియోగ దారులను ఆకర్షించవచ్చని మరో సలహా కూడా ఇచ్చాడు. నేహాకు వివాహ సమయంలో టాటా నానోను స్నేహితులు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ నానో కారునే తన బేకింగ్ ఉత్పత్తుల అమ్మకానికి వినియోగించాలనుకుంది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టింది. కారు వెనుక సీటు లో బేకింగ్ ఉత్పత్తుల నుంచి వినియోగ దారుల కోరిక మేరకు వారు ఉన్న చోటుకే నానో కారు వస్తుందని కావలసిన ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చని ప్రకటన ఇచ్చింది. ఈ విధానం అందరికీ నచ్చడంతో ఉత్పత్తుల అమ్మకం పెరిగింది.

ఇప్పుడు అది పూర్తి స్థాయి వ్యాపార సంస్థగా మారింది. నానో బేకింగ్ ఉత్పత్తుల అమ్మకం పేరు 'స్వీటీష్ హౌస్ మాఫియా' (ఎస్‌హెచ్‌ఎం). వ్యాపార విస్తరణలో భాగంగా ముంబై, పూణే, కోల్‌కతాలో 12 స్టోర్లను నేహ తెరిచింది. ఇటీవల బెంగళూరులో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేశారు. ప్రారంభంలో నేహా చాలా జాగ్రత్తగా ఉండేది. ఆమె కేవలం నాలుగు ఓవెన్ల కొనుగోలు కోసం పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. నానో కుకీలకు మంచి పేరు వచ్చింది. ఒకసారి నానో కారులో నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి మెసేజ్ పెట్టారు. తన భార్య గర్భవతి అని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ప్రసవించినట్లు ఎవరైనా పేజీలో వ్యాఖ్యానించారు. ఆమెకు నుటెల్లా సీ సాల్ట్ కుకీలు చాలా ఇష్టం.

దయచేసి బ్రీచ్ కాండీలో డెలివరీ చేయండి " అని పోస్ట్ పెట్టారు. నానో కారులో నుండి కుకీ వ్యాపారం మొదలు పెట్టిన ఒక సంవత్సరం తరువాత ఆమె సెప్టెంబర్ 2014 లో ముంబైలో మొట్టమొదటి స్వీటిష్ హౌస్ మాఫియా పేరుతో దుకాణాన్ని ప్రారంభించింది. దుకాణం పేరు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి దుకాణం అద్భుతమైన విజయాన్ని సాధించింది . ప్రజలు మా కుకీలను ఎక్కువగా ఇష్టపడడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది లాభదాయకమైన వెంచర్‌గా మారింది, ఇది ఇతర ప్రదేశాలలో దుకాణాలను ఏర్పాటు చేయడానికి మమ్మల్ని ప్రేరేపించింది అని నేహ చెప్పింది.

Next Story

RELATED STORIES