Medak : గర్భిణిని పట్టించుకోలే.. స్ట్రెచర్‌పైనే ప్రసవించింది

Medak : గర్భిణిని  పట్టించుకోలే..  స్ట్రెచర్‌పైనే ప్రసవించింది

మెదక్ జిల్లా తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డెలివరి కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని సిబ్బంది పట్టించుకోకపోవడంతో స్ట్రెచర్‌పైనే ప్రసవించింది. అయితే శిశువు ఉమ్మనీరు మింగడంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

వనజ అనే గర్భిణి నిన్న రాత్రి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. అయితే డెలివరికి ఇంకా 15 రోజుల సమయం ఉందని వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ఓవైపు స్ట్రెచర్‌పైనే నొప్పులతో వనజ నరకయాతన అనుభవిస్తుంటే.. సిబ్బంది మాత్రం ఏం చక్కా ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. భార్య బాధను చూడలేక వైద్య సిబ్బంది దగ్గరకు వెళ్లిన భర్త శ్రీనివాసులును సైతం ఏమాత్రం పట్టించుకోలేదు సిబ్బంది. ఇక నొప్పులు తీవ్రం కావడంతో అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే చిన్నారి ఉమ్మనీరు మింగడంతో పరిస్థితి విషమించింది. వైద్య సిబ్బంది తీరుపై వనజ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story